మరణించి మరో ముగ్గురిలో జీవించాడు

  • కిడ్నీ, లివర్ దానం
  • వాయి, రోడ్డు మార్గాల్లో అవయవాల తరలింపు


తాను మరణించి అవయవ దానం ద్వారా మరో ముగ్గిరిలో జీవించిన రైతు. ఇది మాకు ఎంతగానో గర్వంగా ఉందని అన్నారు మృతుని కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే… అనంతపురం జిల్లా పాల్యం గ్రామానికి చెందిన నారాయణ స్వామి (59) వ్యక్తి సోమవారం రోజున రోడ్డు ప్రమదానికి గురయ్యారు. దీంతో వెంటనే అతన్ని చికిత్స కోసం కిమ్స్ సవీర ఆస్పత్రికి తరలించారు. అతన్ని రక్షించడానికి మూడు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ బుధవారం రోజున బ్రెయిన్ డెడ్ అయ్యారు.
ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై కిమ్స్ సవీరలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతిని కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. అనంతరం వారి అంగీకారంతో కిడ్నీలు, లివర్ దానం చేశారు. చ‌నిపోతూ మ‌రో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గ‌ర్వంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. స్థానిక ప్ర‌జ‌లు వారి కుటుంబ స‌భ్యుల‌ను అభినందించారు. జీవ‌న్‌ధాన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవ‌స‌రం ఉన్న‌చోటికి లివర్, కిడ్నీలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతపురం నుండి బెంగుళూరు వరకు రోడ్డు మార్గన వెళ్లి బెంగళూరు నుండి వాయి మార్గంలో వైజాగ్ కి అవయవాన్ని తరలించారు. అలాగే రోడ్డు మార్గంలో నెల్లూరుకి మరో అవయవాన్ని తరలించారు. అవయవాల తరలింపులో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన అనంతపురం, కర్నాటక పోలీసులకు జీవన్ దాన్ అభినందనలు తెలియజేసింది.