ఆలీకి కీలక పదవి

సినీ నటుడు , వైస్సార్సీపీ నేత అలీకి జగన్ సర్కార్ కీలక పదవి అప్పజెప్పింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరిగానే అలీకి జీతభత్యాలు లభించనున్నాయి.

ఇక 2019 ఎన్నికలకు ముందే వైస్సార్సీపీలో అలీ చేరారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ నుంచి ఆయనకు మంచి పదవే దక్కుతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే అవేవీ కార్యరూపం దాల్చకపోగా…తాజాగా అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఇక గత ఎన్నికల్లో వైస్సార్సీపీకి టాలీవుడ్ నుండి భారీగానే మద్దతు లభించింది.. కానీ ఈ సారి మాత్రం ఆలా మద్దతు కష్టమే అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా టికెట్స్ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు చాలామందికి నచ్చలేదు. ఇదే చిత్రసీమ ప్రముఖులను వైస్సార్సీపీ కి దూరం చేసినట్లు అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆలీకి పదవి ఇవ్వడం చర్చ గా మారింది.