మెలొర్రా నాలుగు పండుగ కలెక్షన్ల ఆవిష్కరణ
- మెలొర్రా మొత్తం ఆర్డర్లకు దక్షిణాది వాటా ఇప్పటికే గణనీయ స్థాయిలో 28% దాకా ఉంది
- 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశవ్యాప్తంగా 350 ఎక్స్ పీరియెన్స్ సెంటర్స్ ను నెలకొల్పాలని మెలొర్రా యోచిస్తోంది
- అసలైన భారతదేశంతో తను అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు వివిధ నగరాలకు తన విస్తరణను వేడుకు చేసుకునేందుకు గాను సంస్థ ఇటీవలే నూతన ఫెస్టివ్ యాడ్ క్యాంపెయిన్ #HarGharMelorra ను ప్రారంభించింది.
భారతదేశంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్నడి2సి బ్రాండ్, ట్రెండీ, లైట్ వెయిట్, బిఐఎస్ హాల్ మార్క్ డ్ బంగారు ఆభరణాలను అందుబాటు ధరలకే అందించేందుకు పేరొందిన మెలోరా భారతదేశం, యూఏఈ, యూఎస్ ఏ, యూకే, యూరప్ లలో 26,000కు పైగా పిన్ కోడ్స్ లో డెలివరీ చేయాలన్న లక్ష్యాన్ని సాధించింది, ఇం కా విస్తరణపథంలో కొనసాగుతోంది. తన ఆశయానికి తగినట్లుగా ఆకాంక్షాపూరిత పండుగ సీజన్ సందర్భంగా ఆనందాయక సందర్భాలను అందిస్తూ ఈ బ్రాండ్ ప్రతీ శుక్ర వారం ఒక నూతన కలెక్షన్ ను అందిస్తోంది. బంగారం, వజ్రాభరణాల్లో ఇవి మొత్తం 75కు పైగా డిజై న్ల దాకా ఉన్నాయి. రాబోయే పండుగల సందర్భంగా ప్రతీ రోజూ తన భారీ శ్రేణి, డిజైన్ల నుంచి ఎంచుకునే అవకాశాన్ని ప్రతీ భారతీయ మహిళకు కల్పించేందుకు వాగ్దానం చేస్తూ, సంస్థ ఇటీవలే తన నూతన ఫెస్టివ్ యాడ్ క్యాంపెయిన్ #HarGharMelorra ను ప్రారంభించింది. మెలొర్రా మొత్తం ఆర్డర్లకు దక్షిణాది వాటా ఇప్పటికే గణనీయ స్థాయిలో 28% దాకా ఉంది. ఈ ప్రాంతంలో గణనీయంగా విస్తరించాలని సంస్థ ఆశిస్తోంది.
తన నూతన పండుగ కలెక్షన్ లో మెలొర్రా ఈ పండుగ సీజన్ లో 4 నూతన కలెక్షన్లను ప్రవేశపెట్టనుంది. ఇవి పండుగ సీజన్ సందడిని పరిపూర్ణంగా ప్రతిబింబించనున్నాయి. ఈ బ్రాండ్ 23 ఎక్స్ పీరియెన్స్ సెంటర్లను కలిగిఉంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశవ్యాప్తంగా 350 ఎక్స్ పీరియెన్స్ సెంటర్స్ ను నెలకొల్పా లని మెలొర్రా యోచిస్తోంది. ఆభరణాలను స్పర్శించే, అనుభూతి చెందే, ట్రయల్ చేసే అవకాశంతో కూడిన తన తిరుగులేని ఎంచుకునే మరియు కొనుగోలు చేసే అనుభూతిలతో మెలోరా ఎవ్రీడే గోల్డ్ వేర్ లో అత్యంత ప్రాధాన్యపూరిత బ్రాండ్లలో ఒకటిగా శరవేగంగా వృద్ధి చెందుతోంది.
ఈ సందర్భంగా మెలోర్రా వ్యవస్థాపకులు, సీఈఓ సరోజా యెరమిల్లి మాట్లాడుతూ, ‘‘రెండేళ్ల కోవిడ్ కాలం తరువాత, ఈ ఏడాది ప్రజలు పండుగలను స్నేహితులు, కుటుంబసభ్యులతో కలసి పెద్దఎత్తున వేడుక చేసు కోనున్నారు. మెలోరా 4 విభిన్న కలెక్షన్ల ద్వారా ఈ వేడుకల్లో భాగమయ్యేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లైట్ వెయిట్ జ్యుయలరీడి డిమాండ్ బాగా పెరగడాన్ని మేం గమనించాం. మహిళలు వీటిని తమ రోజువారీ దుస్తులతో పాటుగా ధరించవచ్చు. మా క్యాంపెయిన్ #HarGharMelorra అనేది ఈ దిశలో ఒక ముందడుగు.దీంతో మేం మారుమూల మార్కెట్లను కూడా చేరుకోనున్నాం. మరెంతో మంది నుంచి మా ఉత్పత్తులకు యాక్సెసబిలిటీని అధికం చేసుకోనున్నాం. అంతర్జాతీయ ఫ్యాషన్ ధోరణుల నుంచి మా డిజైన్లు స్ఫూర్తి పొందాయి. పండుగ అయినా సరే, రోజువారీగా ధరించేందుకైనా సరే…. ప్రతీ సందర్భానికి పరిపూర్ణ ఎంపికగా ఉంటాయి. ప్రతీ శుక్రవారం మేం ఒక నూతన కలెక్షన్ ను ప్రవేశపెట్టనున్నాం. బంగారం, వజ్రాభరణాల్లో ఇప్పటికే 18000కు పైగా డిజైన్లను అందిస్తున్నాం. మా డిజైన్లలో ఎంతో అందంగా కనిపించేలా చేస్తూ, దృక్పథాలలో, పాలెట్స్ లో మార్పు తీసుకువస్తూ, బంగారం పట్ల భారతీయులకు గల మోజు అధికం చేయడమే మా లక్ష్యం’’ అని అన్నారు.
వినూత్న ధోరణులకు, ఆధునిక డిజైన్లకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. ప్రతీ సందర్భానికి తగిన ఆభరణాల కోసం చూసే వారికి సరైన జోడు. ప్రతీ వారం ఆవిష్కరించబడిన 75 డిజైన్లతో మెలొర్రా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారితో సహా ప్రతీ ఒక్కరికీ తన విస్తృత శ్రేణి ఆభరణాలకు సులభ యాక్సెస్ ను అందిస్తోంది. తద్వారా వారు ట్రెండీ, అందుబాటు ధర ఆభరణాలను తమ ఇంటి గుమ్మం వద్దనే పొందేలా కూడా చేస్తోంది.
2016లో తన కార్యకలాపాలు ప్రారంభించింది మొదలుకొని ఫైన్, ట్రెండీ, లైట్ వెయిట్ గోల్డ్ జ్యుయలరీ విభాగంలో మెలొర్రా సంచలనం సృష్టించింది. గత ఏడాది కాలంగా సంస్థ తన అభివృద్ధిని మరింత ముమ్మరం చేసింది.పండుగ సీజన్ లోనూ ఇదే ధోరణి కొనసాగలదని విశ్వసిస్తోంది. కొవిడ్ -19 మహమ్మారి కాలం కొనుగోలుదారుల ప్రాథమ్యాలను వారు నాణ్యత, డిజైన్ లకు ప్రాధాన్యం ఇస్తూనే, లైట్ వెయిట్ మరియు అందుబాటు ధరల్లో లభ్యమయ్యే ఫైన్ జ్యుయలరీని కొనుగోలు చేసేలా మార్చివేసింది.
మెలొర్రా వీటన్నిటినీ, అంతకు మించి కూడా అందిస్తుంది. అది 10 వేలకు లోపు జనాభా ఉన్న పల్లెలు మొదలుకొని పది లక్షలకు పైబడి జనాభా ఉండే నగరాలపై తన ముద్రను వేసింది. మెలొర్రా ప్రస్తుతం రూ.350 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇప్పటి నుంచి 5 ఏళ్లలోగా 1 బిలియన్ డాలర్ కంపెనీ కావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.