మ‌హిళ‌ల‌లోనే ఎక్కువ‌గా కీళ్ల స‌మ‌స్య‌లు

మన దేశంలో సుమారు 6 కోట్ల మంది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ మరియు రుమటాలజికల్ వ్యాధులను చాలామంది తరచు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ సమస్యలు వృద్ధాప్యం వల్ల వచ్చాయనుకుంటారు. ఈ అపోహ వల్ల చాలా మంది ప్రజలు చికిత్స పొందడానికి కూడా ప్రయత్నించరు. అందువల్ల ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా, ఆర్థరైటిస్ కు చికిత్స ఉందని చెప్పాలన్నదే మా ప్రధాన ఉద్దేశం.

ఆర్థరైటిస్ వల్ల తలెత్తే సమస్యలు బాధాకరంగా ఉండటమే కాకుండా, ప్రాణాంతకం కావచ్చు. ఇవి ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లాంటి పలు అవయవాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల రోగులకు గుండెపోటు వచ్చే ప్రమాదం 200% ఎక్కువగా ఉంటుంది, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 150% ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద, వారికి వార్ధక్యం త్వరగా వస్తుంది. (వారు తమ వాస్తవ వయస్సు కంటే పదేళ్లు పెద్దగా కనిపిస్తారు).

ఈ వ్యాధులు కేవలం వృద్ధులను మాత్రమే కాదు… పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు.. ఇలా ఏ వయస్సు వారైనా ప్రభావితం చేస్తాయి. ఆర్థరైటిస్ కు కారణమయ్యే 100 కంటే ఎక్కువ వేర్వేరు వ్యాధులు ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ (లూపస్), సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి అనేక ఇతర వ్యాధులు సాధారణమైనవి.
శారీరకంగా బాధ కలిగించే ఈ వ్యాధి ఉండటం వల్ల అది ఉన్నవారి ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. సాధారణ జనాభాతో పోలిస్తే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న రోగులలో నిరాశ రెట్టింపు ఉంటుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ జాయింట్ ఆర్థరైటిస్ చికిత్సకు ఏడాదికి సుమారు రూ.53,000 ఖర్చవుతుందని అంచనా. వ్యాధి వల్ల నేరుగా పడే ఆర్థిక భారంతో పాటు, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు కాబట్టి, కుటుంబ జీవితంపైనా తీవ్రప్రభావం ఉంటుంది. ఇంట్లో మహిళ దీర్ఘకాలిక రుమటాలజికల్ వ్యాధితో బాధపడుతుంటే కుటుంబం మొత్తం, ముఖ్యంగా పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. పిల్లలు లేదా భర్త మహిళతోపాటుగా ఆసుపత్రికి వెళ్లడానికి సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చులు పెరగడం, పనిగంటలు కోల్పోవడం, ఉత్పాదకత తగ్గడం లాంటివి ఉంటాయి. ఈ వ్యాధి వల్ల వైకల్యం సంభవించి, రోజువారీ కార్యకలాపాలు కూడా ఇబ్బందికరం అవుతాయి.
ఆర్థరైటిస్ ఉన్న రోగులు సామాజిక ఒంటరితనంతో పాటు కొన్నిసార్లు ఉద్యోగం కూడా కోల్పోతారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న ప్రతి నలుగురు రోగుల్లో ముగ్గురి పని సామర్థ్యం దెబ్బతిందని, ప్రతి ఐదుగురిలో ఒకరు శాశ్వతంగా పని మానేయాల్సి వచ్చిందని మన దేశంలో చేసిన పరిశోధనల్లో తేలింది.
వ్యాధి కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పడే ఆర్థిక భారాన్ని రోగి, వారి కుటుంబం భరించాలి. బీమా కంపెనీలు ఆర్థరైటిస్ వల్ల కలిగే సమస్యలకు చెల్లింపులు చేసే విధానం అత్యంత అశాస్త్రీయంగా, పక్షపాతపూర్వకంగా, పురాతనమైనదిగా ఉంటుంది. వాటిలో చాలావరకు చికిత్స చేయలేనివని వర్గీకరించారు. దానివల్ల మన దేశంలో బీమా, హెల్త్ కేర్ డెలివరీ ప్రొవిజన్లలో ప్రస్తుత విధానాలను రీయింబర్స్ మెంట్ బెనిఫిట్ల నుంచి మినహాయించారు. వేరే దేశాల్లో మాత్రం చాలావరకు బీమా కంపెనీలు ఈ సమస్యలకు కవరేజి కల్పిస్తాయి. దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ రీయింబర్స్ మెంట్ మార్గదర్శకాలను ఇటీవలి విప్లవాత్మక చికిత్స విధానాల దృష్ట్యా సమూలంగా మార్చాల్సిన తక్షణ అవసరం ఉంది.

ఆర్థరైటిస్, రుమటాలజికల్ రుగ్మతలకు కారణమయ్యే వ్యాధులు చాలావరకు ఉన్న అపోహల కారణంగా బయటపడవు. ఈ వ్యాధులకు చికిత్సచేయడంలో ఇటీవలి కాలంలో వచ్చిన అత్యాధునిక విధానాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇలా చికిత్సతీసుకునే రోగుల జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతోంది. కానీ, అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సను పొందేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఇది రోగులకు అనవసరమైన దుఃఖం, బాధను కలిగిస్తుంది. చాలామంది సరైన సమయంలో చికిత్స పొందకపోవడం వల్ల నష్టపోయి తీవ్రంగా బాధపడతారు.
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం థీమ్.. “కీళ్ల వ్యాధులకు చక్కని చికిత్స ఉంది”

ఆర్థరైటిస్, ఇతర రుమటాలజికల్ సమస్యలకు కారణమయ్యే వ్యాధుల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వైద్యులు, రోగులు ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ఈ వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పలు కార్యకలాపాలు చేస్తాయి. ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని అనేక సంవత్సరాలుగా చేసుకుంటున్నా, భారతదేశంలో జరిపిన పరిశోధన ప్రకారం, రోగులు రోగలక్షణాల ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తప్ప రుమటాలజిస్టులను కలవట్లేదు!! వైద్యం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు ఇకపై ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను భరించాల్సిన అవసరం లేదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఆ రోజు చేసే అన్ని కార్యకలాపాలకు “కీళ్ల వ్యాధులకు చక్కని చికిత్స ఉంది” అనే థీమ్ను నిర్ణయించారు.

ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమం:
సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో 2022 అక్టోబర్ 11న ఆర్థరైటిస్ పరిస్థితులపై అవగాహన కల్పించానికి ఇక్కడి రుమటాలజీ విభాగం ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పలు వర్గాలకు చెందిన ఆర్థరైటిస్ బాధితులు పాల్గొన్నారు. ఇంటరాక్టివ్ సెషన్ లో, రోగుల ప్రశ్నలకు సీనియర్ రుమటాలజిస్టులు సమాధానం ఇచ్చారు. కొంతమంది రోగులు తమ విజయ గాథలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వారి కథల్లో కొన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో, రోగులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు, పీజీ వైద్యులు, వైద్యులు పాల్గొన్నారు.

కిమ్స్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర మౌళి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుమటాలజిస్టులు డాక్టర్ జుగల్ కిశోర్, డాక్టర్ శ్రీశైల దత్తా, డాక్టర్ సువర్ణ శిల్ప పాల్గొన్నారు.
కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రుమటాలజిస్టులు డాక్టర్ జుగల్ కిషోర్, డాక్టర్ శ్రీశైల దత్త, సువర్ణ శిల్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపోహలు – వాస్తవాలు అనే పుస్తకాన్ని డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ఆవిష్కరించారు. కిమ్స్ సీనియర్ వైద్యులు రాసిన ఈ పుస్తకం ప్రజల్లో మన ఆరోగ్యం విషయంలో ఉండే పలురకాల అపోహలను దూరం చేస్తుంది.

నడుం నొప్పితో విలవిల్లాడాను నాకు మూడేళ్ల క్రితం తీవ్రమైన నడుంనొప్పి మొదలైంది. చాలాచోట్ల చికిత్స చేయించినా అసలుకారణం ఏంటనేది చెప్పలేదు. చివరకు డాక్టర్ శరత్ చంద్రమౌళి గారి దగ్గరకు వచ్చాను. ఆయన చాలా సహనంతో, నేను చెప్పినదంతా విన్నారు. నా సమస్యకు కారణాలేంటో వివరించి, నా సమస్య ఎంథెసైటిస్ ఆర్థరైటిస్ అని చెప్పారు. దానికి చాలా మంచి చికిత్స చేశారు. ఆయన నిజంగా అరుదైన వ్యక్తి. నేనిలా ఉన్నానంటే అందుకు ఆయనే కారణం.

  • అఖిల, హైదరాబాద్

ఆయనవల్లే ఈ భూమ్మీద ఉన్నాను
నేను 2017 అక్టోబర్ 4న తొలిసారి డాక్టర్ శరత్ చంద్రమౌళి గారి దగ్గరకు వచ్చాను. అప్పటికి నా ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాను. దానంతటికీ కారణం లిమిటెడ్ క్యుటేనియస్ సిస్టెమెటిక్ స్లెరోసిస్ (ఐఎల్డీ-ఎన్ఎస్ఐపీ) అని ఆయన చెప్పారు. ఏమాత్రం హడావుడి లేకుండా చాలా నెమ్మదిగా నా సమస్యను వివరించారు. నేను ఎప్పుడు వచ్చినా ఎంతో ఆప్యాయంగా, బాగా చూస్తూ, నా వ్యాధిని తగ్గించారు. ఆయన రోగనిర్ధారణ, చికిత్స రెండూ చాలా బాగుంటాయి. ఆయనో అద్భుతమైన డాక్టర్. ఈ భూమ్మీద నేను ఇంకా నాలుగు రోజులు ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. నాకు అత్యవసరమైన సమయంలో అండగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు

  • చేబియ్యం శైలజ, కాకినాడ

ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చి.. కోలుకున్నాను
నా పేరు కె. సైమన్ పాల్. మా నాన్నగారు సంజీవ్. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేను పదో తరగతి చదువుతున్నాను. నేను 2020 మార్చి నుంచి ఆరోగ్యపరంగా చాలా బాధపడుతున్నాను. ఆ సమయంలో, నేను నిజామాబాద్లో ఉన్న ప్రతి పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నించాను. కానీ నా సమస్యకు కారణమేంటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఐసీయూలో దాదాపు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు నన్ను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నేను ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేరాను. కొన్నాళ్ల తర్వాత రుమటాలజీ విభాగానికి నా కేసును మార్చారు. వారి పరీక్ష, రోగనిర్ధారణ ద్వారా, నాకు ఎస్ఎల్ఈ ఉన్నట్లుగా కనుగొన్నారు. అప్పటి నుంచి నేను ఇక్కడే చికిత్స పొందాను. ఇప్పుడు నేను పాఠశాలకు మామూలుగా వెళ్తున్నాను. ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాను. డాక్టర్ శరత్ చంద్ర మౌళి, ఆయన బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • సైమన్ పాల్, నిజామాబాద్

79 ఏళ్ల వయసున్న మా అమ్మకు అద్భుత వైద్యం
మా అమ్మ కె.స్వరాజ్యలక్ష్మి 79 సంవత్సరాల వయస్సులో ఉన్నట్టుండి తన కిందిభాగంలో, శారీరక దృఢత్వంలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆమె తన చేతులు కూడా కదపలేకపోయారు. ఆమెను వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఐసీయూలో చేర్పించాను. తొలుత ఆమెకు గులియన్ బారీ సిండ్రోమ్ ఉందన్న అనుమానంతో న్యూరాలజీ ఓపీడీలో ఉంచారు. తర్వాత స్జోగ్రెన్ సిండ్రోమ్ అన్నారు. అనంతరం డాక్టర్ శరత్ చంద్రమౌళి ఆధ్వర్యంలో రుమటాలజీ విభాగానికి పంపారు.
డాక్టర్ శరత్ చంద్రమౌళి, ఆయన బృందం ఆమెను అద్భుతంగా చూసుకున్నారు. ఐసీయూలో చేరిన 7 రోజుల్లోనే మా అమ్మ బాగా కోలుకుంది. అప్పటి నుంచి తన పనులు తానే చేసుకుంటోంది. డాక్టర్ శరత్, ఆయన బృందం ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. రోగిని అద్భుతంగా చూసుకుంటారు, తద్వారా ఆమె చాలా ఆత్మవిశ్వాసం పొందింది. వారి రోగనిర్ధారణ, చికిత్స విధానాలు అద్భుతమైనవి. మా అమ్మ ఇప్పటికి నాలుగు నెలలుగా వాళ్ల పర్యవేక్షణలో ఉన్నారు.

డాక్టర్ శరత్ చంద్రమౌళి గారి అద్భుతమైన చికిత్స వల్లే ఈ 79 సంవత్సరాల వయస్సులో కూడా మా అమ్మ తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. అందుకు మేము ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆమె చాలా బాగున్నారు, తన పనులన్నీ తానే చేసుకుంటున్నారు.

  • చలపతిరావు, హైదరాబాద్

పాతికేళ్లుగా మా భార్యకు సమస్య
నా భార్య 25 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతోంది. 1995లో ఆర్థరైటిస్ మరీ తీవ్రంగా మారడంతో ఆమెను నిమ్స్ లో చేర్పించాం. పాక్షిక ఉపశమనంతో రెండు వారాల చికిత్స తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ మందులు వేసుకోవడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే, గత ఐదేళ్లుగా ఆయుర్వేద మందులు ఉపయోగించడం మానేశారు. రెండోసారి తీవ్రమైన చేతి వేలి కీలు నొప్పులు రావడంతో.. ఆరు నెలల క్రితం, నాకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ శ్రీ శరత్ చంద్ర మౌళి అనే మంచి డాక్టర్ దొరికారు.
ఇప్పుడు నా భార్య పరిస్థితి ఆరు నెలల తర్వాత చాలా మెరుగుపడింది. 6 నెలల పాటు చికిత్స పొందిన తర్వాత ఆమె ఆరోగ్యంలో మంచి మార్పును గమనించాం. ఇప్పుడు ఆమె తన రోజువారీ ఇంటి పనులు చేసుకుంటోంది. అద్భుతమైన, చక్కటి రోగ నిర్ధారణ, చికిత్స అందించినందుకు డాక్టర్ శరత్ చంద్ర మౌళికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

  • మోహనరావు వంగర

చిన్నవయసు నుంచే ఎన్నో సమస్యలు
నా పేరు నిఖిత (27). నాకు ఒక దశాబ్దానికి పైగా రుమటాయిడ్ సంబంధిత అనారోగ్యం ఉంది. లక్షణాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. అవి ప్రారంభమైనప్పుడు నాకు చాలా అసంబద్ధంగా అనిపించాయి. ఎందుకంటే అప్పుడు నాకు కేవలం 16 సంవత్సరాల వయసు. ఆ సమయంలో అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలియదు. తొలిసారి ఓ చల్లటి ప్రదేశానికి వెళ్లి వచ్చిన రెండేళ్ల తర్వాత.. నాకు వేళ్లు పాలిపోయి కనిపించాయి. తర్వాత కీళ్ల నొప్పులు, కొన్ని రక్తపరీక్షలతో కొన్నాళ్లకు విషయం తెలిసింది. అనంతరకాలంలో ఆటో ఇమ్యూన్ వ్యాధులతో నాకు అనేక సమస్యలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. డాక్టర్ శరత్ సర్ సహాయంతో, నా మెడలో ఆర్థరైటిస్ అనే క్లిష్టమైన సమస్యను నేను మందులతోనే అధిగమించాను. దీనికి నేను ఆయనకు కృతజ్ఞురాలిని. ఆ తర్వాత నాకు రేనాడ్తో కూడిన స్క్లెరోడెర్మా అని నిర్ధారణ అయినా, ఇప్పుడు మందులతో బాగానే ఉన్నాను. నా సమస్యలకు చికిత్స చేసిన వైద్యులందరికీ, ముఖ్యంగా డాక్టర్ శరత్ చంద్రమౌళి సర్ కు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా దాన్ని దృఢంగా ఎదుర్కొంటానన్న నమ్మకం నాకు ఏర్పడింది.

  • నిఖిత, హైదరాబాద్

శరత్ సార్‌కి జీవితాంతం రుణపడి ఉంటాం
నా పేరు రూత్ రత్న జైవాలా. నా వయస్సు 27 సంవత్సరాలు. నాకు ఎస్ఎల్ఈ, లూపస్తో పాటు మోకాళ్లకు సంబంధించిన ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ 12 ఏళ్ల నుంచి ఉన్నాయి. నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నాకు ఎస్ఎల్ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథెమెటోసస్) ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో 5 దశలుంటాయి. వైద్యులు దానిని నిర్ధారించే సమయానికి నేను అప్పటికే నాలుగో దశలో ఉన్నాను. ఈ సమస్యను కనుగొనడానికి వారికి ౩ నెలలు పట్టింది.
నేను భయంకరమైన రోజులను గడిపాను, చాలా బాధపడ్డాను. 20 రోజుల పాటు వందలాది పరీక్షలు చేయించుకొని, వేలాది మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆసుపత్రిలో చేరాను. వారు నా మూత్రపిండాల నుంచి బయాప్సీ కోసం ఒక ముక్కను కత్తిరించారు. ఎస్ఎల్ఈతో నా బరువు 55 కిలోల నుంచి 80 కిలోలకు పెరిగింది. నా కీళ్లన్నీ పనిచేయడం మానేశాయి, ఇది నాకు పాక్షిక వైకల్యం కలిగించింది. అప్పట్లో నేను ఎక్కువసేపు నడవలేను, నేను నా కాళ్ళను మడిచి కూర్చోలేను, పరిగెత్తలేను, మెట్లు ఎక్కలేను, బరువులు అసలు ఎత్తలేను.

నేను రుమటాలజిస్ట్ దగ్గరకు వెళ్లాలని తెలియక ఏడేళ్లుగా ఒక తప్పుడు వైద్యుడి వద్దకు వెళుతున్నాను. అక్కడే స్టెరాయిడ్లు పెద్దమొత్తంలో తీసుకోవడంతో అనేక దుష్ప్రభావాలు వచ్చాయి. నా ఎముకలు నెమ్మదిగా వంకరపోవడం ప్రారంభించాయి. నా శరీరంలోని ప్రతి కీలు నొప్పించడం మొదలైంది. నా రెండు మోకాళ్లు ఎంత పాడయ్యాయంటే.. అస్సలు నడవలేని స్థితికి చేరుకున్నాను. దాదాపు 8 సంవత్సరాలకు పైగా నేను ఈ కీళ్ల నొప్పులతో బాధపడ్డాను.

సరిగ్గా అప్పుడే నేను డాక్టర్ శరత్ చంద్ర మౌళి గారిని కలిశాను. ఆ స్థితిలో నన్ను చూసి ఆయన అక్షరాలా షాక్ కు గురయ్యారు. ఆలస్యంగానైనా శరత్ సర్ ను కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలనని ఆయన నాకు జీవితంలో ఒక ఆశను ఇచ్చారు. ఆయన నా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులకు చికిత్స ప్రారంభించారు. మెథోట్రెక్సేట్, హెచ్సీక్యూ, వైసోలోన్ వంటి సరైన మందులు ఇచ్చారు. తర్వాత క్రమంగా వైసోలోన్ ఆపారు. ఇది నాకు నిజంగా సంతోషంగా ఉంది. అప్పటి నుంచి నా కీళ్లనొప్పులు తగ్గడం మొదలైంది. నొప్పి తగ్గిన తర్వాతే మళ్లీ నిజంగా జీవిస్తున్నానని అనిపించింది. ఇప్పుడు నేను మామూలుగా నడవగలను, నా పనిని ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతంగా చేసుకోగలను. డాక్టర్ శరత్ సర్ నాకు ఇచ్చిన ఈ జీవితానికి నేను సంతోషంగా ఉన్నాను. ఆయన డాక్టర్లలో రత్నంలాంటివారు. ఆయన వద్ద చికిత్స పొందుతున్న ఎవరైనా సరే చాలా అదృష్టవంతులు. నేను, నా యావత్ కుటుంబం డాక్టర్ శరత్ చంద్ర మౌళి సర్ కు జీవితాంతం రుణపడి ఉంటాము.

  • రూత్ రత్న, హైదరాబాద్