ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పిన కరణ్ జోహర్
బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి..ఆ తర్వాత కుచ్ కుచ్ హోతా హై అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులకు దగ్గర అవ్వడమే కాదు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ఇక ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటె ఈయన..తాజాగా ట్విట్టర్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. ‘జీవితంలో పాజిటివ్ ఎనర్జీల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్తున్నా’ అంటూ కరణ్ ట్వీట్ చేశాడు. అ తరువాత తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.