పార్టీలో మహిళలకు స్థానం లేదు – కాట్రగడ్డ
తెలుగుదేశం పార్టీలో మహిళలకు సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. పార్టీలో మహిళలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, అధికారిక సమావేశాలకు ఆహ్వానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్య నాయకులు అంటే ఎవరు?
ముఖ్య నాయకుల డెఫినిషన్ ఏమిటి?
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం తరపున ఉన్నది నలుగురే మాజీ శాసనసభ్యులు అందులో ఒకరిని నేను..
40 సంవత్సరాల రాజకీయ అనుభవం సీనియారిటీ నిత్యం ప్రజలలో ఉండే పనితనం మీకు నచ్చదా?
అసలే తెలంగాణలో మన పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నాయి పార్టీ పునర్జీవం అవసరం మన ప్రియతమ నాయకులు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవాలన్న మీ బృందం మాత్రమే వెళుతుంది ఎవరిని తీసుకువెళ్లరు.
సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో నా కార్యక్రమాలు మీకు కనిపించవా!
ప్రజా సమస్యల మీద నా నిత్య పోరాటం మీకు కనిపించడం లేదా?
హైదరాబాద్ లో ఉన్న ఏకైక మాజీ శాసన సభ్యురాలుగా రెండు నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ముఖ్య నాయకురాలిగా పరిగణించడానికి మీకు పనికి రాదా గట్టి తెలుగుదేశం నాయకురాలు నీనేనాని సగర్వంగా సవినయంగా చెప్పగలను.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్ వైభవాన్ని సాధించబోతుంది కానీ మీలా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే జరగదు
నాయకులు కార్యకర్తలు సమిష్టిగా సమావేశాలు నిర్వహించాలి
అడుగులో అడుగు వేసి రాష్ట్రమంతా సుడిగాలిలా పర్యటించాలి ఈ సంవత్సరం ప్రతిరోజు అడుగు ముందుకు వేస్తున్నాను ప్రజలు కలిసి వస్తున్నారు ప్రజా పోరాటాలు మొదలవుతాయి తెలుగుదేశం మరల ముందుకు వస్తుంది కానీ మీరు ఇలాంటి పనులు చేయటం మానుకొని అందర్నీ కలుపుకొని పోండి.
అవసరానికి ఎప్పుడు ఫోన్ చేసినా రాష్ట్ర అధ్యక్షులు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎవరిని మేము కలవాలి ఎవరితో మాట్లాడాలి అర్థం కాని అయోమయంలో ఉన్నాం.
తెలంగాణకి ముఖ్యమైన సంస్కృతిని ప్రతిబింబించే మంగళ గౌరీవ్రతమైన బతుకమ్మని చేసుకోలేకపోయాం దీవెన తీసుకోలేకపోయాం దసరా పండుగ పార్టీ ఆఫీసులో ఆయుధ పూజ చేయలేకపోయాం భగవంతుని ఆశీస్సులు మన చంద్రబాబు నాయుడు గారికి కావాలి
మరి ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ముఖ్య నేతల సమావేశం దసరా పండగ ముందు ఎందుకు జరగలేదు?