కాళేశ్వ‌రం అవినీతిపై సీబిఐకి ఫిర్యాదు – ష‌ర్మిల

తెలంగాణ‌లోని కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవినీతి జ‌రిగింద‌న్నారు వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిల. ఈ మేర‌కు ఢిల్లీలోని సీబీఐ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని ఈ రోజు ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. డీఐజీ ర్యాంక్ ఆఫీసర్ తో విచారణ జరిపిస్తామని సీబీఐ డైరెక్టర్ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్ కు చిత్తశుద్ధే ఉంటే సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలి.

వైయస్ఆర్ గారు రూ.38వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 16లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. కేసీఆర్ దొర డిజైన్లు మార్చి, పేరు మార్చి రూ.1.20లక్షల కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచిండు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని ప్రాజెక్టుకు.. కరెంట్ బిల్లులే వేల కోట్లు కడుతుండు.

వైయస్ఆర్ నిర్మించిన దేవాదుల చెక్కుచెద‌ర‌కుండా ఉంది. కేసీఆర్ క‌ట్టిన కాళేశ్వ‌రం మూడేండ్ల‌కే మునిగింది. మెగా కంపెనీ నాణ్యత లేని పనులు చేసినా ఎలాంటి చర్యలు లేవు. కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి ప్రజల సొమ్మును పీక్కుతిన్నారు. ప్రాజెక్టులో అడుగ‌డుగునా ఇంజ‌నీరింగ్ లోపాలు క‌న‌ప‌డుతున్నాయి. నాణ్య‌త లేని ప‌నులు క‌న‌ప‌డుతున్నాయి.

కేసీఆర్ కు కాళేశ్వరం ఒక ఏటీఎంలా ప‌ని చేస్తుంద‌ని, కాళేశ్వ‌రంతో వేల కోట్లు సంపాదించాడ‌ని కేంద్ర బీజేపీ పెద్ద‌లు చెప్తున్నారు కానీ ఎందుకు విచార‌ణ జ‌రిపించ‌డం లేదు? అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? టీఆర్ఎస్ కు ‘బీ’ టీంగా బీజేపీ పనిచేస్తుందా?

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. ప్రజల సొమ్ము కాపాడడం కోసం కాళేశ్వరం అవినీతిపై ఆఖరి వరకు పోరాడుతాం. ఇలాంటి అవినీతి అక్రమాలు దేశానికి పాకక ముందే మొదళ్లోనే తుడిచేయాలి.

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ మెగాకే ఎందుకు ఇస్తున్నట్లు? ఒకే కంపెనీకి అన్ని ప‌నులు ఎందుకు క‌ట్ట‌బెడుతున్న‌ట్టు? మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ కు మ‌ధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటి?

కాళేశ్వ‌రం స్కాం దేశంలోనే అతి పెద్ద‌ది. కేంద్రానికి సంబంధించిన శాఖల నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు స‌మ‌కూరాయి. యావ‌త్ దేశ ప్ర‌జ‌ల సొమ్ముతో క‌ట్టిన ప్రాజెక్టు కాళేశ్వ‌రం. ఇలాంటి ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జ‌ర‌గాల్సిందే.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. ప్రజల సొమ్ము కాపాడడం కోసం కాళేశ్వరం అవినీతిపై ఆఖరి వరకు పోరాడుతాం. ఇలాంటి అవినీతి అక్రమాలు దేశానికి పాకక ముందే మొదళ్లోనే తుడిచేయాలి.