మాజీ ఎమ్మెల్యేను విచారించిన ఈడీ

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. BS-3వాహనాలను BS-4గా మార్చి విక్రయించారనే కేసులో ఆయన ఈడీ ముందుహాజరయ్యారు . జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.

BS-3 వాహనాలను BS-4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు జేసీ ట్రావెల్స్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జేసీ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది . ఈడీ నోటీసులతో జేసీ ప్రభాకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారు అశ్విత్ రెడ్డి వెళ్లిపోయారు. అయితే తనపై తప్పుడు కేసులు పెట్టారని జేసీ ఆరోపించారు. ఈ విషయంపై న్యాయపరంగా తేల్చుకుంటామన్నారు.