అలియాభ‌ట్ సీమంతం

బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం అలియా గర్భిణీ కావడంతో ఆమె సీమంతం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ జస్ట్‌ లవ్‌ అని క్యాప్షన్‌ ఇస్తూ పసుపు రంగులోని హార్ట్‌ ఎమోజీలను జత చేసింది. ఈ సీమంతం వేడుకల్లో ఆమె ఎల్లో డ్రెస్‌లో చాలా సింపుల్‌ గా కనిపించగా, భార్యకు ముద్దు పెడుతూ రణ్‌బీర్ ఎంతో మురిసిపోయాడు.

ఈ వేడుకలకు రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌, ఆలియా తల్లి సోనీ రజ్దాన్‌, తండ్రి మహేష్‌ భట్‌, షహీన్‌ భట్‌, కరిష్మా కపూర్‌ హాజరయ్యారు. కాగా ఆలియా, రణ్‌బీర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే ఆలియా తాను గర్భవతి అని ప్రకటించింది.