హోమ్ క్రెడిట్ ఇండియా కొత్త లోగో

అంతర్జాతీయ వినియోగదారుల ఫైనాన్స్ ప్రొవైడర్ స్థానిక విభాగమైన హోమ్ క్రెడిట్ ఇండియా ఆర్‌బీఐ నియంత్రిత వినియోగదారుల ఎన్‌బీఎఫ్‌సీగా ఈ సంవత్సరం భారతదేశంలో విజయవంతంగా ప‌ది సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. భారతదేశ మార్కెట్, ఆర్థిక సమ్మేళనానికి కట్టుబడి, హోమ్ క్రెడిట్ విశ్వసనీయ, సరసమైన ఆర్థిక ఉత్పత్తులు, సేవల ద్వారా తొలి దశాబ్దంలో 1.5 కోట్ల మందికి పైగా ఆకాంక్షలను నెరవేర్చింది.

ఈ మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో హోమ్ క్రెడిట్ ఇండియా ఈ మహత్తరమైన సందర్భాన్ని ఘనంగా వేడుక చేసుకుంటోంది – ఇందులో భాగంగా #10SaalBemisal(10సాల్‌బేమిసాల్) 10 సంవత్సరాల లోగోను ఆవిష్కరిస్తుంది, హోమ్ క్రెడిట్ తన దశాబ్ధ ప్రయాణంలో సాధించిన వివిధ మైలురాళ్లతో రోజు రోజుకూ ఎలా బలాన్ని పెంచుకుందో చూపే డిజిటల్ ఏవీ విడుదల చేయనుంది.