సఫారీలను చిత్తు చేసిన భారత్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి జట్టు చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్లు కేఎల్ రాహుల్(51), సూర్యకుమార్ యాదవ్(50) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. సఫారీ సేన నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో ఛేదించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, నోర్జే తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా.. 106/8 స్కోరు చేసింది. సఫారీల బ్యాటర్లలో కేశవ్ మహరాజ్ (41) టాప్ స్కోరర్ కావడం విశేషం. మార్‌క్రమ్ (25), పార్నెల్ (24) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లలో నలుగురు డకౌట్ కాగా.. ముగ్గురు గోల్డెన్ డక్ కావడం విశేషం. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.