శంకరంపేటలో ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండలంలోని ఆయా గ్రామాల నుండి పద్మశాలి కులబంధావులు పెద్దఎత్తున్న తరలివచ్చి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పద్మశాలీలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్బంగా శాలిపేట గ్రామానికి చెందిన గుండు రాజు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమం సహా అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. బాపూజీ పోరాటాలు మరువలేనివి అని పేర్కొన్నారు. స్వాతంత్రం రాక ముందే కాదు.. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో బాపూజీ ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయంగా కూడా పద్మశాలీలు అభివృద్ది చెందితేనే బాపూజీ ఆత్మశాంతి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి, శివశంకర్, దినాకర్, శ్రీనివాస్, చిప్పకృష్ణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.