కీళ్లవ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
డాక్టర్. అపర్ణ.
కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్
కిమ్స్ ఐకాన్, వైజాగ్.
మనిషికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా అతిముఖ్యమైనది. నిత్య జీవన శైలిలో అతి ప్రధానమైన ఈ వ్యాయాయంపై ప్రజల్లో సరైన అవగాహాన లేకుండా పోతోంది. ఇందు కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ల వ్యాధి) మీద దృష్టి సారించింది. ప్రజల్లో ఈ వ్యాధిపట్ల సుదీర్ఘమైన అవగాహన తీసుకరావాలి.
గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ ప్రభావంతో ప్రజలు అనేకమైన వ్యాధులకు గురైనారు. కోవిడ్ నుండి కోలుకున్న తరువాత కూడా వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా శరీరంలో నొప్పులు, కీళ్ల నొప్పులతో సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఫిజియోథెరపీ చాలా ఉపయోపడింది.
ఇక కీళ్లు బలహీనపడటం, అరుగుదల కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే మృదువైన కుషన్‌లాంటి పదార్థం దెబ్బతినడం వల్ల కీళ్ల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గడంతో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోతాయి. దాంతో నొప్పి, స్టిఫ్‌నెస్ వస్తుంది. ఈ కండిషన్‌కు వయసు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే బరువు ఎక్కువగా మోసేవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణాలు :
- అధిక బరువు /స్థూలకాయం
- కీళ్లపై బలమైన దెబ్బ తగలడం (ట్రామా)
- కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో (వృత్తిపరంగా)
- కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) రుమటాయిడ్ ఆర్థరైటిస్
- డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం
- కొన్నిరకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదా: కార్టికోస్టెరాయిడ్స్).
లక్షణాలు :
- నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉండటం, కదలికలతో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది
- స్టిఫ్‌నెస్ : కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం. ఫలితంగా కీళ్లలో కదలికలు తగ్గుతుంది
- కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి శబ్దాలు వినిపిస్తాయి.
- వాపు : కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్‌డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు
- వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్‌నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పరీక్షలు
- కీళ్లకు సంబంధించిన ఎక్స్-రేతో ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
జాగ్రత్తలు / నివారణ :
- బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం)
- క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పాల ఉత్పాదనలకు సంబంధించిన పదార్థాలను తీసుకోవడం
- విటమిన్-డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం
- తగినంత వ్యాయామం చేయడం.
ఫిజియోథెరపిలో ఉండే పద్దతుల ద్వారా కొన్ని పద్దతుల ద్వారా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ… కీళ్ళ వ్యాధి అధికంగా కాకుండా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌లో ఉండే అధునాతన పరికరాలతో ఎలక్ట్రొథెరపి, హాట్, కొల్డ్ థెరపి, అల్ట్రాసౌండ్ థెరపి, ఇంటర్వెషనల్ థెరపి, అలాగే కండరాలను బలపరిచే కొన్ని వ్యాయామాల పద్దతులను ఉపయోగించడం ద్వారా మోకాలి నొప్పులను తగ్గించడంలో ఫిజియోథెరపి సహాయపడుతుంది.