భూమ ఇంటి అల్లుడు కాబోతున్న మంచు మనోజ్?
మంచు కుటుంబం తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అక్కరు లేని ఫ్యామిలీ ఇది. హీరో మెహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ తన మొదటి భార్య నుండి విడిపోయిన సంగతి విదితమే. ఆ తర్వాత ఏపీలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన కూతురితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే వారిప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని సమాచారం.
భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు.