రాజాసింగ్‌పై పీడి యాక్ట్ నిలుస్తుందా?

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే మూలాఖత్ ద్వారా రాజాసింగ్ను కుటుంబసభ్యులు కలిశారు. నిజానికి పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు.. జైలులో 3 నెలలు లేదా కనీసం ఏడాది ఉండే అవకాశం ఉంది. అడ్వైజరీ బోర్డు పరిధిలోనే పీడీ యాక్ట్ కేసుల విచారణ జరగనుంది. ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తుల పీడీ యాక్ట్ ప్రపోజర్స్ను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. రాజాసింగ్ను అడ్వైజరీ బోర్డు కమిటీ విచారించనుంది. ఇప్పటికే బోర్డుకు పోలీసులు సాక్ష్యాలు సమర్పించారు. నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. కమిటీ విచారణ తర్వాతే హైకోర్టులో పిటిషన్కు అవకాశం ఉంది. ఇలా విచారణకు వచ్చిన పలు కేసుల్లో పీడీ యాక్ట్‌‌ను కమిటీ ఎత్తివేసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 2,573 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయి. గతేడాది 664 మందిపై పోలీసులు పీడీ యాక్ట్‌ను నమోదు చేశారు.