కేసీఆర్ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: సీఎం కేసీఆర్ లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని అన్నారు. సీబీఐ, ఈడీని జేబు సంస్థగా బీజేపీ వాడుకుంటోందని కవిత ఆరోపించారు. కేసీఆర్ అంటే బీజేపీ సర్కార్‌కు భయమని…అందుకే ఇబ్బంది పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘దళితబంధు ప్రజాప్రయోజన పథకమే. నోటీసులపై ఆధారాలు లేనిదే ఏం మాట్లాడలేం. కేసులు పెట్టాలనుకుంటే చేయగలిగిందేమీ లేదు. ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలపై నమ్మకం పోయింది. బీజేపీలో ఉంటే ఈడీ, సీబీఐ దాడులు జరగవు. మునుగోడులో అమిత్‌షా సభ ఫెయిలైంది. దాని నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్లాన్. ప్రతిపక్షాలు ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా వాళ్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు మాత్రం ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని కవిత అన్నారు.
మోదీ టార్గెట్ నేను కాదు కేసీఆర్: కవిత
హైదరాబాద్: ‘‘ప్రధాని మోదీ టార్గెట్ నేను కాదు సీఎం కేసీఆర్. నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఢిల్లీలో ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం ఉంది’’ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో తెలియదని తోచిపుచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలకు ఊతం ఇవ్వరాదన్నారు. కోర్టు చెప్పిన తరువాత కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీని జేబు సంస్థగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని, తెలంగాణలోనూ బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని కవిత దుయ్యబట్టారు. కేసీఆర్ అంటే బీజేపీ సర్కార్‌కు భయమని, అందుకే ఆయన పక్కన ఉండేవారిని ఇబ్బంది పెడుతున్నారని కవిత విమర్శించారు..