అత్యవసర వైద్యసమయాల్లో కీలక పాత్ర డ్రైవర్లదే
అత్యవసర వైద్య సహాయాల్లో ఎయిర్‌లైన్స్, ఎయిర్ అంబులెన్స్, అంబులెన్స్ డ్రైవర్లు పనితీరు అభినందీయమని పేర్కొంది కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం. అంతర్జాతీయ మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్గాన్ డొనేషన్ వైస్ ప్రెసిడెంట్ , కౌన్సిలర్ మంగాదేవి, హాస్పిటల్ మెడికల్ సూపరిడెంట్ డాక్టర్. సంబీత్ సాహు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్‌లో డ్రైవర్లను, ఎయిర్‌లైన్స్ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జీవన్‌ధాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత, హైదరాబాద్ సిటి ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శంషాబాద్ & బేగంపేట్) ప్రసూన్ కుమార్ హాజరి, సిఐఎస్ఎఫ్, ఆర్‌జిఐఏ డిఫ్యూటి కమాండెంట్ మనీష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడారు. వివిధ రకాల ప్రమదాల్లో రోగులకు అత్యవసర వైద్య సదుపాయాలను అందించడంలో అంబులెన్స్ డ్రైవర్లు కీలక పాత్ర వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో సొంత కుటుంబ సభ్యులే కోవిడ్ సోకిన వారిని పట్టించుకోకపోతే సుధూర ప్రాంతాల నుండి అంబులెన్స్ డ్రైవర్లో ప్రాణాలను పనంగా పెట్టి వారిని కాపాడారు. అంతేకాకుండా ఒక మనిషి తాను మరణిస్తూ అవయవాలు దానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగునింపుతారు. కానీ ఆ అవయవాలను తరలించడంలో ఎయిర్‌లైన్స్ అధికారులు, సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు, అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఎంతో కృషి చేస్తారు. వివిధ ప్రాంతాల నుండి ఎయిర్ అంబులెన్స్ ద్వారా వచ్చిన రోగులను, ఇతర అవయవాలను తరలించడంలో ట్రాఫిక్ పోలీస్ వారు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్‌ని సమన్వయం చేసుకుంటూ… నిర్ధేశించిన కాలంలో చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అవయవదానం చేసిన వ్యక్తి ఎంత ప్రాయుఖ్యమో వాటిని తరలించే వారికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల కాలంలో కిమ్స్ హాస్పిటల్‌లో వందల సంఖ్యలో అవయవాల మార్పిడి జరిగింది.
హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ మంచి ఫలితానిస్తుందన్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో అవయావాలను తరలించడంలో డ్రైవర్లు ఎంతో వేగంగా చేరుకోవడానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు కీలక పాత్ర వహిస్తున్నారు.
రోడ్డు మార్గమే కాకుండా వాయి మార్గంలో కూడా అత్యవసర వైద్య సదుపాయాల సేవలను అందించడానికి ఎయిర్‌లైన్స్ అధికారులు కూడా ఎంతో శ్రమిస్తున్నారన్నారు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శంషాబాద్ & బేగంపేట్) ప్రసూన్ కుమార్ హాజరి, సిఐఎస్ఎఫ్, ఆర్‌జిఐఏ డిఫ్యూటి కమాండెంట్ మనీష్ కుమార్. ఎయిర్ అంబులెన్స్ ద్వారా వచ్చిన అవయవాలను ఎయిర్‌పోర్ట్ నుండి వివిధ హాస్పిటల్స్‌లకు తరలించడంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.