సినిమా పేరుతో స్కేచ్ ప‌క్క ప్లాన్ అదే

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు తెలంగాణ చాలా స‌మ‌యం ఉన్నా… ఇప్ప‌టి నుంచే కాకా పుట్టిస్తున్నాయి. అధికారం కాపాడుకోవ‌డానికి తెరాస‌… అధికారంలోకి రావ‌డానికి భాజ‌పా, కాంగ్రెస్ పార్టీలు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండు ద‌ఫా ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ గ‌ల్ల‌తైన తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ఇక్క‌డ ఏదో ఒక ప్ర‌య‌త్నం చేసి తాము కూడా పోటీలో ఉన్న‌మ‌ని తెలియ‌జేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి.

ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏరేంజ్‌లో స్కేచ్‌లు రెడీ చేస్తుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే దుబ్బాకా, హుజురాబాద్‌, హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు గెలుపు ఉత్స‌హంగా ఉన్న ఆ పార్టీ త‌ర్వలో జ‌ర‌గ‌బోయో మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు అమిత్ షా తో భారీ బ‌హిరంగ స‌భ‌కు కూడా ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలోనే సినిమా హీరో, మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డు ఎన్టీఆర్ లంచ్ మీటింగ్ అమిత్ షా క‌ల‌వనున్నారు. ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చాలా బాగుంద‌ని… ఇది అభినందించాడానికి క‌ల‌వ‌నున్న‌ట్లు అధికారం స‌మాచారం. అయితే
ఇప్పుడు ఈ వార్త తెలంగాణ రాజ‌కీయాల్లో పెన సంచ‌ల‌నంగా మారింది. భార‌తీయ జ‌న‌తా పార్టీని తెలంగాణ అధికారంలో తీసుక‌రావ‌డానికి ఎన్టీఆర్ చేయుత కావాల‌ని అమిత్ షా కోర‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న ఉత్స‌హానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ తోడైతే గెలుపును ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని క‌మ‌ల‌నాధుల ఆలోచ‌న‌. అయితే ఇది ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి మ‌రీ.