ఎర్ర గులాబీలుగా మారుతున్నారు

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ గ‌తంలో ఒక పార్టీ, సిద్దాతం దానికి క‌ట్టుబ‌డి ప‌ని చేసే కార్య‌క‌ర్త‌లు, నేతలు ఉండేవారు. ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేదు. క‌రుడుగ‌ట్టిన నేత‌లు కూడా త‌మ పార్టీ సిద్దాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి అధికార పార్టీల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నారు.

ఎర్ర‌జెండా అంటేనే ప్ర‌జ‌ల పార్టీ. బ‌డుగుల బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా ఉండే పార్టీ. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా… అధికారంలో ఏ పార్టీ ఉన్నా…. వెనుకా ముందు ఏం ఆలోచించ‌కుండా వారికి అండ‌గా నిలిచేది. కానీ ప్ర‌స్తుతం పూర్తి వ్య‌తిరేకంగా మారిపోయింది ఆ ఎర్ర‌జెండా పార్టీ. అధికార తెరాస పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతోంది. క‌మ్యూనిస్టులు బ‌లంగా ఉన్న ఆయా జిల్లాలో తెరాస మ‌రింత బ‌లంగా త‌యారు కావ‌డానికి రంగాన్ని సిద్దం చేసుకుంటుంది. తెరాస-సీపీఎం పార్టీలో పొత్తులు పెట్టుకొని రానున్న ఎన్నిక‌ల్లో బరిలోకి దిగాల‌ని ఇప్ప‌టి నుంచే క‌లిసి ముందుకు వెళ్తున్నారు.