కేసీఆర్ ఏటీఎం మిషన్ కాళేశ్వరం : లక్ష్మణ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్‌కి ఏటీఎంలా పని చేసిందన్నారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.90వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, కాళేశ్వరం వండర్ కాదు, బ్లండర్ అని ఆరోపించారు. కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి, కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి, ఈ ప్రాజెక్టు వండర్ అంటూ వారికివారే కితాబిచ్చుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పంపుహౌ్‌సతోపాటు మోటార్లు కూడా నీట మునిగిపోవడంతో, ఈ ప్రాజెక్టు వండర్ కాదని, బ్లండర్ అని స్పష్టమైందన్నా రు. కాళేశ్వ రం ప్రాజెక్టు కాస్త ఖాళీ ఈశ్వరం… కాజేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణ వ్యయాన్ని రూ.30వేల కోట్ల నుంచి రూ.1.20లక్షల కోట్లకు పెంచుకుని, రూ.90వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే మంత్రులు కొత్త భాష్యం చెబుతున్నారని విమర్శించారు.