గిరిధారి హోమ్స్ సరికొత్త ప్రాజెక్టు.. హ్యాపీనెస్ హబ్
హైదరాబాద్‌లో థీమ్ ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తుందన్న పేరు సంపాదించిన గిరిధారి హోమ్స్ తాజాగా హ్యాపీనెస్ థీమ్ ఆధారంగా హ్యాపీనెస్ హబ్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టును టీఎస్‌పీఏ జంక్షన్ చేరువలోని కిస్మత్‌పురాలో సుమారు 5.47 ఎకరాల్లో జి+ 5 అంతస్తుల్లో 3 టవర్లను నిర్మిస్తోంది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో మొత్తం 570 ఫ్లాట్లు వస్తాయి. నిర్మాణ పనులూ ఆరంభమైన హ్యాపీనెస్ హబ్‌కు రెరా అనుమతి కూడా లభించింది. ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రూ.5,500గా నిర్ణయించారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1033 నుంచి 1601 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. 2025 డిసెంబరు లోపు పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది.
గిరిధారి హోమ్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. కస్టమర్లకు అందుబాటు ధరలో.. ఆరోగ్యకరమైన కమ్యూనిటీలను నిర్మించి.. ఫైవ్ స్టార్ తరహాలో సదుపాయాల్ని కల్పించి.. సరికొత్త సంతోషాన్ని అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యం. హ్యాపీనెస్‌కు సంబంధించి యూఎన్ రిపోర్టు ప్రకారం.. 146 స్థానాల్లో మన దేశం 136వ స్థానంలో ఉంది. మనకంటే భూటాన్ వంటి చిన్నదేశాలు అత్యుత్తమ స్థానంలో ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ప్రజల సంతోషాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశ్యంతో.. తమవంతు బాధ్యతగా హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ తెలియజేసింది. ఈ ప్రాజెక్టును ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ ఎండీ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలుదారులకు కాస్త భిన్నమైన అనుభూతిని కలిగించాలన్న ఉన్నత లక్ష్యంతో.. థీమ్ ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మించడం మీదే మొదటి నుంచి దృష్టి సారిస్తున్నామన్నారు. ఈసారి తమ వద్ద ఫ్లాట్లు కొన్నవారు మరింత సంతోషంగా ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. అందుకే, విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్ కాన్సెప్టును అందిపుచ్చుకుని.. చిన్నారులు, ఆధునిక యువతీయువకులతో పాటు పెద్దలూ నిత్య సంతోషంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో.. హ్యాపీనెస్ హబ్‌కు శ్రీకారం చుట్టామని వివరించారు. ఇందులో కొన్నవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేందుకై టవర్ల ఎత్తును కేవలం ఐదు అంతస్తులకే పరిమితం చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.155 కోట్లు అని.. రానున్న ఏడాదిలోపు సుమారు మూడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాల్ని ప్రారంభిస్తామని.. వీటి విలువ ఎంతలేదన్నా రూ.1500 కోట్ల దాకా ఉంటుందని వెల్లడించారు.
ఇందుకే సంతోషం కావాలి!
గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు.. అధిక వాయు కాలుష్యం.. రసాయన కాలుష్యం.. శబ్దకాలుష్యం.. చిన్న చిన్న విషయాల్లో కొందరితో గొడవలు.. ఇలాంటి అనేక కారణాల వల్ల హ్యాపీనెస్ కరువైందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గజిబిజి, గందరగోళంతో అర్థం లేని జీవనశైలి ప్రశ్నార్ధకంగా మారిందని.. ఈ క్రమంలో.. సంతోషంగా ఉండాలన్న ప్రతిఒక్కరీ తాపత్రయాన్ని దృష్టిలో పెట్టుకుని.. హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్టును డిజైన్ చేశామని వివరించారు. ఇందులోకి రాగానే ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు ప్రతిదీ మన సంతోషాన్ని రెట్టింపు చేసేల ఉంటాయని తెలిపారు. శ్వాస తీసుకునే విధానం మారిపోతుందని.. ప్రతిఒక్కరూ ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుంటారని చెప్పారు.
అక్కడే ఎందుకంటే?
కిస్మత్‌పూర్ ఏరియా ప్రకృతికి చేరువగా ఉండటమే కాదు.. అభివృద్ధికి అధిక అస్కారం ఉంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలో 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో హియాయత్ సాగర్ లేక్ ఉంది. అప్పా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ చూసుకుంటే.. 6 వేల ఎకరాల్లో మృగవని పార్కు, 3 వేల ఎకరాల్లో ఆర్మీ ఏరియా వంటివి ఉన్నాయి. ఏజీ యూనివర్సిటీలో 6 వేల ఎకరాలకు పైగా ఓపెన్ స్పేస్ ఉంది. 30 శాతం కంటే ఎక్కువ గ్రామాలు కానీ, గ్రౌండ్ కవరేజ్ ఫరెవర్ రానీ ఏరియా ఏదైనా ఉంటే అది ఇదేనని అంచనా వేసింది. అతిత్వరలో మెట్రో రైల్వే స్టేషన్ ఇక్కడే ఏర్పాటు కానుంది. గిరిధారి ప్రాజెక్టు ముందు నుంచే వంద అడుగుల రోడ్డు కూడా అభివృద్ధి చేయనున్నారు.
హ్యాపీ హ్యాపీ క్లబ్‌హౌజ్
ఇందులోని క్లబ్ హౌజ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇందులో వచ్చేవారి మనస్సు ఆనందంగా మారిపోవాలన్న ఉద్దేశ్యంతో.. హ్యాపీ బాడీస్, హ్యాపీ మైండ్స్, హ్యాపీ సోల్స్, హ్యాపీ హార్ట్స్ అనే సరికొత్త కాన్సెప్టును రూపొందించారు. ప్రాజెక్టులోని టవర్లకు ఆనంద, ఆహ్లాద, అమేయ, అద్భుత వంటి పేర్లను పెట్టారు. బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపినెస్‌ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు. ఇందులో నివసించేవారు ఎలాంటి ప్రతికూలమైన మానసిక పరిస్థితిలో ఉన్నా.. వాటిని చూడగానే మెదడులో ఆనందానికి సంబంధించిన రసాయనాలు వెలువడతాయి. ఆనందంగా ఉండటం మనిషి యొక్క నిజస్వరూపం. ఎల్లప్పుడు చిదానందంగా ఉండేలా ఆ స్వరూపంలోకి తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యమని సంస్థ అంటోంది.