సంక్షేమ భవనాల్లో ఎమ్మెల్యే, మంత్రుల పిల్లలు ఉంటరా ?
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ భవనాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు అక్కడ ఉంటారా అని ప్రశ్నించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. రాష్ట్రంలో సంక్షేమ భవనాల పరిస్థితి ఆధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ_హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న
సంక్షేమ భవన్ ఎదుట నిరసన తెలియజేశారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ నాయకులను
హుమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది దారుణమన్నారు. నిరసన తర్వాత హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లి, పోలీసులతో మాట్లాడి టీ ఎన్ఎస్ఎఫ్ విద్యార్థిలను పరామర్శించి, వారు విడుదలయ్యట్లుగా చర్యలు తీసుకున్నారు.