కేసీఆర్‌కి పొరిగింటి కూర‌నే న‌చ్చుతుంది

అవును మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పొరిగింటి కూర బాగా నచ్చుతుంది. ఎదుకంటే… ఇంటి వైద్యం ఒంటికి ప‌ట్ట‌న‌ట్టు. రైతు లేనిదే రాజ్యం లేదు అనే నానుడి ఉండేది. గ‌త ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లోని రైతాంగాన్ని ప‌ట్టించుకోలేద‌ని, స్వ‌రాష్ట్రం త‌ర్వాత అభివృద్ధి జ‌రిగిందని… రైతులు బాగు పడ్డారాని చెబుతుంటారు పింకీలు.. అయితే స్వ‌రాష్ట్రంలో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారికి ప‌ట్ట‌దు… ఎక్క‌డో పంజాబ్‌లో రైతులు మ‌ర‌ణిస్తే… తెలంగాణ ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌న్నుల‌ను తీసుకెళ్లి అక్క‌డ పంచాడు. రైతులకు ఇవ్వ‌డం త‌ప్పేమి కాదు కానీ.. ముందు ఇంటిని చూసుకోవాలి క‌దా… ఆ త‌ర్వాత పొరిగింటి గురించి ఆలోచించాలి. అంతేకానీ పొరిగింటి కూర పుల్ల‌గ ఉంది నేను అక్క‌డే తింటా…. అక్క‌డే చేస్తా… అంటే కుద‌ర‌దు క‌దా… ఆ పంజాబ్ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే… మ‌ళ్లీ క‌ర్నాట‌క రైతుకు నేనున్నానంటూ సాయం అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శంచడానికి ఇటీవల వచ్చిన జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్ కుమార్.. ఈ పర్యటన అనంతరం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. విమల్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే ఆయన కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు శాంత కుమార్ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి సాయం అందేలా చూశారు.

మ‌రీ అదే కాళేశ్వ‌రం నీళ్లు వ‌చ్చి వేల‌, ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌ల మునిగితే… అంద‌ని సాయం క‌ర్నాట‌క‌లో ఎందుకు అందిచారు అంటే దానికి ఒక లెక్క ఉంది. అక్క‌డ భాజ‌పా ప్ర‌భుత్వం ఉంది కాబ‌ట్టి… అందుకే… భాజ‌పా చేయ‌ని సాయానికి మేమేం చేశాం అని చెప్ప‌డానికి అంతే.. అందుకే దొర‌కు ఎప్పుడూ పొరిగిల్లే న‌చ్చుతుంది మ‌రీ..