పేట్ పూజ600 వెయిటర్కాలింగ్పరికరాలనుఉపయోగిస్తున్న వివిధహైదరాబాద్రెస్టారెంట్లు, నెలకు 1,000 ఉపకరణాల ఏర్పాటుకు యోచనలో సంస్థ
పిస్తాహౌస్, యాంటెరా కిచెన్ & బార్, చుంగ్ హువా చైనీస్ రెస్టారెంట్, రోస్ట్: ది కెఫిన్ క్యాపిటల్, మండిలిసియాస్, రెస్ట్రోడ్రైవ్ –ఇన్ తో సహా 130కి పైగా రెస్టారెంట్లలో అందుబాటు ధరల్లో ఒక్కొక్కటి రూ.750 విలువైన ఈ ఉపకరణాల ఏర్పాటు
హైదరాబాద్, జులై 2022: బిల్లింగ్, ఇన్వెంటరీ, సీఆర్ఎం, థర్డ్ పార్టీ ఆన్ లైన్ ఆర్డరింగ్ వంటి వాటిని సమర్థం గా నిర్వహించే సరళవంతమైన, శక్తివంతమైన పిఒఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) సాఫ్ట్ వేర్ ను అందించే భారతదేశపునెం.1 రెస్టారెంట్ మేనేజ్ మెంట్ వేదిక అయిన పేట్ పూజ, హైదరాబాద్ లో 600కు పైగా తన వెయిటర్ కాలింగ్ ఉపకరణాలను అమర్చింది. ఇటీవలే ఆవిష్కరించబడిన ఈ ఉత్పాదనకు ఇదో కొత్త మైలురాయి. రాబోయే కాలం లో ఇలాంటి వాటిని నెలకు 1000 చొప్పున అమర్చేందుకు వీటి ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు పేట్ పూజ ఇప్పటికే కృషి చేస్తోంది.
సరళవంతమైన, వ్యయాలను తగ్గించే సాంకేతికత అయిన వెయిటర్ కాలింగ్ డివైజ్ అనేది వెయిటర్ పై భారాన్ని తగ్గిస్తుంది. వాళ్ళ పనులను సులభతరం చేస్తుంది. అదే సమయంలో కస్టమర్ల డైనింగ్ అనుభూతులను మెరుగుపరుస్తుంది. ఇది ఒక చిన్న, వైర్లెస్ ఉపకరణం. రెస్టారెంట్ లో ప్రతీ టేబుల్ పై దీన్ని అమర్చవచ్చు. వెయిటర్ ను పిలిచేందుకు, నీళ్ల కోసం లేదా బిల్లు కోసం దీని బటన్ ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. ప్రతీ బటన్ కు ఒక్కో రంగు బల్బు ఉంటుంది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్ అభ్యర్థన ఏమిటో సులభంగా తెలుసుకోగలుగుతారు. ఒకసారి కస్టమర్ తన అభ్యర్థనను వెల్లడించిన తరువాత, పేట్ పూజ పిఒఎస్ వద్ద మరియు వెయిటర్ యొక్క యాప్ (కెప్టెన్ యాప్) అలర్ట్ జనరేట్ అవుతుంది, వెయిటర్లకు కస్టమర్ల అవసరాలు తెలియజేయబడుతాయి. తద్వారా వారు కస్టమర్ టేబుల్ వద్దకు పదేపదే తిరగాల్సిన అవసరం లేకుండానే ఎన్నో పనులు చేసుకోవడం వీలవుతుంది.
ఈ సందర్భంగా పేట్ పూజ సహవ్యవస్థాపకుడు, సీఈఓ పృథ్వీ పటేల్ మాట్లాడుతూ, ‘‘600 వెయిటలర్ కాలింగ్ ఉపకరణాలు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా అమర్చబడ్డాయని తెలిపేందుకు సంతోషిస్తున్నాం. మేం అందిస్తున్న సొల్యూషన్ కు ఇలాంటి అపూర్వ స్పందన రావడం ఉద్వేగభరితులను చేస్తోంది. రెస్టారెంట్ల లో డైనింగ్ అనేది ఒక సంపూర్ణ అనుభూతి. దాన్ని ఆనందదాయకం, సౌకర్యవంతం చేయడం అనేది రోజంతా నిలబడే పని చేసే వెయిటర్ల బాధ్యత. మేం అందించే వెయిటర్ కాలింగ్ ఉపకరణాలు ఆయా కార్యకలాపాలను స్ట్రీమ్ లైన్ చేస్తాయి. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వెయిటర్ విధులను సరళీకరిస్తాయి. కస్టమర్లకు తిరు గులేని డైనింగ్ అనుభూతిని అందిస్తాయి. త్వరలోనే మేం ఉత్పత్తిని పెంచబోతున్నాం. దేశవ్యాప్తంగా మరె న్నో రెస్టారెంట్లలో వాటిని ప్రవేశపెట్టాలని చూస్తున్నాం’’ అని అన్నారు.
ఒక్కొక్కటి రూ.750 విలువైన ఈ ఉపకరణాలు ఎంతో అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఇప్పటికే ఇవి ప్రఖ్యాత పిస్తాహౌస్,మెర్జాస్ పామ్ అరబియానా, యాంటెరా కిచెన్ అండ్ బార్, చుంగ్ హువా చైనీస్ రెస్టారెంట్, రోస్ట్ : ది కెఫీన్ క్యాపిటల్, లావిష్ రెస్టారెంట్, మండిలిసియాస్,రెస్ట్రోడ్రైవ్–ఇన్,ఇంకా హైదరాబాద్ లోని మరెన్నో పేరొందిన రెస్టారెంట్లలో ఉన్నాయి.