కోల‌హాలంగా అడ్డ‌గుట్ట న‌ల్ల‌పోచమ్మ బోనాలు

హైద‌రాబాద్‌లో బోనాల పండుగ‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఆషాడంలో వ‌చ్చే ఈ బోనాల ఉత్స‌వాల‌ను ఎంతో భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హిస్తారు. ఆదివారం మ‌ల్కాజ్‌గిరి, గౌతంన‌గ‌ర్‌, అడ్డ‌గుట్ట‌లోని న‌ల్ల‌పోచ‌మ్మ దేవాల‌యంలో ఘ‌నంగా ఈ బోనాల ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ మేర‌కు ఆల‌య కమిటీ స‌భ్యులు పెద్ద ఎత్తున విద్యుత్ దీపాల‌తో ఆ ప్రాంతాన్ని శోభాయమానంగా తీర్చిద్దిదారు.