ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరెల్లి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలతో nurture.farm ఒప్పందం


రైతులకు మెరుగైన బీమా ఉత్పాదనలను అందించేందుకు వీలుగా

ఆర్థిక సురక్షిత మరియు తిరిగి కోలుకోవడానికి వీలు కల్పించేలా, గ్రామీణ సహకార ఆర్థిక వ్యవస్థను విస్తరించేలా స్మార్ట్ బీమా ఉత్పాదనల రూపకల్పనకు ఆయా కంపెనీలకు వీలు కల్పించనున్న భాగస్వామ్యం

బెంగళూరు, జులై 2022 భారతదేశ అగ్రగామి అగ్రిటెక్ స్టార్టప్ అయిన nurture.farm తాజాగా nurture.farm యాప్ ను ఉపయోగించే 1.9 మిలియన్ల మంది రైతులకు తన బీమా పరిష్కారాలను అందిం చేందుకు గాను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరెల్లి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

nurture.farm అనేది పెంపకందారులు, రైతులు, ఆహార వ్యవస్థలకు సంబంధించిన ఓపెన్ డిజిటల్ ప్లాట్ ఫామ్. వ్యవసాయ దిగుబడులను అధికం చేసేందుకు, వాటిని లాభదాయకం చేసేందుకు, భవిష్యత్ తరాలకు వాటిని సుస్థిర దాయకమైనవిగా చేసేందుకు ఇది చురుగ్గా కృషి చేస్తోంది. కంపెనీ ఇటీవలే కార్పొరెట్ ఏజెన్సీ లైసెన్స్ ను భారతదేశ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (ఐఆర్ డిఎ) నుంచి పొందింది. తక్కువ ధరలకే వినూత్న బీమా పరిష్కారాలను రైతులు పొందేందుకు ఇది nurture.farm కు వీలు కల్పిస్తుంది.

ఈ సందర్భంగా nurture.farm బిజినెస్ హెడ్, సీఓఓ శ్రీ ధ్రువ్ సాహ్నే మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో బీమా తీసుకోవడం చాలా తక్కువగా ఉంది, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలో. రైతులు ఆర్థికంగా కోలుకోవడాన్ని అధికం చేసేందుకు స్మార్ట్ బీమా పరిష్కారాలను అభివృద్ధి చేయాలని మేం కోరుకుంటున్నాం. విశ్వసనీయ బ్రాండ్లు అయిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరెల్లి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలతో మేం భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. మా మార్గంలో ఇదో పెద్ద ముందడుగు. మా 1.9 మిలియన్ల మరియు ఇంకా మాతో చేరుతున్న రైతులకు వారు తమ దిగుబడులను అధికం చేసుకునేందుకు, రాబడులను సాధిం చేందుకు గాను వన్ స్టాప్ డెస్టినేషన్ గ ఉండాలన్న మా లక్ష్యాన్ని సాధించేందుకు ఇది మాకు తోడ్పడు తుంది’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ రూరల్ అండ్ అగ్రి ఎమర్జింగ్ బిజినెస్ లైన్స్ హెడ్ ప్రియా కుమార్ మాట్లాడుతూ, ‘‘అవసరాలకు అనుగుణమైన బీమా పరిష్కారాలను అందించేందుకు గాను గత కొన్నేళ్లుగా మేం రైతులతో సన్నిహితంగా కలసి పని చేస్తున్నాం. nurture.farm తో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం. మన రైతులకు టెక్ ఆధారిత ప్లాట్ ఫామ్ ద్వారా అండగా నిలవడంలో ఇది మరో ముందడుగు. nurture.farm తో అనుబంధం దేశవ్యాప్తంగా రైతుల పట్ల మా అంకితభావాన్ని మరింత బలో పేతం చేస్తుంది. బీమా అవగాహనను పెంచేందుకు, మరింత మందిని బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు, తద్వారా అనుకోని పరిస్థితుల్లో వాటిల్లే ఆర్థిక నష్టాల నుంచి వారు రక్షణ పొందేందుకు కూడా మా భాగ స్వామ్యం తోడ్పడుతుంది’’ అని అన్నారు.

ఈ నెల మొదట్లో ఫ్యూచర్ జనరెల్లి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా nurture.farm గణనీయ భాగ స్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ జనరెల్లి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (క్రాప్ ఇన్సూరెన్స్, రూరల్ అండర్ రైటింగ్) శ్రీ సందర్శి విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘nurture.farm తో భాగ స్వామ్యం మాకెంతో ఆనందదాయకం. బీమా ఉత్పాదనలతో రైతులకు సేవలందించేందుకు మేమెంతో ఆసక్తితో ఉన్నాం. వారు ఎదుర్కొనే ఆర్థిక నష్టాల నుంచి అవి రక్షణ కల్పిస్తాయి. దేశంలో, మరీ ముఖ్యంగా ఇప్పటికీ బీమా తీసుకోవడం అంతంత మాత్రంగానే ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో బీమా చొరబాటును అధికం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇప్పటికే రైతుల నమ్మకం చూరగొన్న nurture.farm వంటి నూతన తరం అగ్రిటెక్ భాగస్వాములు ఒక విశ్వసనీయ మార్గం ద్వారా నమ్మకమైన, పారదర్శక రీతిలో బీమా రైతులకు చేరేలా చేస్తున్నారు’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యాలతో, 2022-23లో 20 లక్షల మంది రైతులకు బీమా పరిష్కారాలను అందించడాన్ని nurture.farm లక్ష్యంగా చేసుకుంది. రైతులకు రిస్క్ తగ్గించే పరిష్కారాలను కనుగొనేందుకు అది తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. దేశంలో రైతులకు ఇప్పటి వరకూ లభ్యం కాకుండా పోయిన రిమోట్ సెన్సిం గ్ ఆధారిత క్షేత్రస్థాయి బీమాను అందించాలని nurture.farm భావిస్తోంది.
************************************************