తెలంగాణ బెస్ట్ బ్లడ్ బ్యాంక్‌గా కిమ్స్ బ్లడ్ సెంటర్
తెలంగాణలో బెస్ట్ బ్లడ్ సెంటర్ కిమ్స్ అవార్డ్ కైవసం చేసుకున్నది. ఈమేరకు గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డ్ రావడం చాల గర్వంగా ఉందన్నారు కిమ్స్ హాస్పిటల్స్ సీఓఓ భరత్‌కాంత్ రెడ్డి. మంగళవారం హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి పూల మొక్కలు బహుకరించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేస్తున్నవారి మనుసు చాలా గొప్పనైనదన్నారు. ఎలాంటి బంధాలు చూడకుండా… ఆపద సమయాల్లో విలువైన రక్తాన్ని దానం చేసి ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న రక్తదానం మరింత మంది ఆదర్శంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ రక్తదాతలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు రావాలని కోరారు.
అనంతరం కిమ్స్ బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ కీర్తి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అధికంగా రక్తదానం చేస్తున్న వారిలో కిమ్స్ హాస్పిటల్స్ టాప్ 5 లిస్ట్‌లో ముందుగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో రక్తందానం చేయడానికి ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోగులు. కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి నెల 1000 మందికి పైగా ఇక్కడ రక్తదానం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే కాదు, ఎవరు దానం చేస్తున్నారో వారికి కూడా ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయన్నారు. రక్తంలో ప్రాణాలను కాపాడే అంశాలు అనేకం ఉన్నాయని, ఇవి వివిధ వ్యాధులు మరియు గాయాల చికిత్సకు తోడ్పడతాయని తెలిపారు. చాలా మంది ప్రజల కోసం, రక్త దాతలు వారి జీవితరేఖలలాగా ఉన్నారు. రక్తదానం చేయటం వలన ఇంకొకరికి జీవితాన్ని ఇస్తున్నాము అనే ఒక అందమైన, గర్వంగా అనుభూతి కలుగుతుంది. దీనిని మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు. 18 -60 వయస్సు ఉండి, 45కిలోల పైన బరువు ఉన్న ఒక మంచి ఆరోగ్యమైన వ్యక్తి, 450 మీ.లీ వరకు రక్తం దానం చేయవచ్చు. పురుషులు 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు మరియు స్త్రీలు 4 నెలలకొక్కసారి చేయవచ్చన్నారు.