పొగతాగితే బూడిదైపోతారంతే
నగరంలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన అమోర్ హాస్పిటల్స్ ఈరోజు ‘వ రల్డ్ నో టొబాకో డే’ను పుర స్క రించుకొని కూకట్‌పల్లి ప్రాంతంలో అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించింది. చెన్నై సిల్క్స్ (కూకట్ పల్లి), శ్రీ కుమరన్ తంగమలైగై జ్యువెలర్స్ (మెహిదీపట్నం) ఉద్యోగులతో కలిసి ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, సహాయక సిబ్బంది కవాతులో పాల్గొన్నారు. సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు ధూమపానం మానేయాలని విజ్ఞప్తి చేయడానికి సుమారు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆనంద్ సినిమాలో హీరోగా నటించిన ప్రముఖ నటుడు రాజా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి ధూమపానం మానేయాల్సిన తక్షణ ఆవశ్యకతపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమోర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ బి.రెడ్డితో పాటు చెన్నై సిల్క్స్, శ్రీ కుమరన్ తంగమలైగై జ్యువెలర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి అమోర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “పొగాకు నుంచి వెలువడే నికోటిన్ మెదడులోని రసాయనం డోపామైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ధూమపానం చేస్తున్న వ్యక్తికి తక్షణ ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ తక్షణ ఆనందం వ్యక్తికి, అతని కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య విపత్తుగా మారుతుంది. అమోర్ ఆస్పత్రిలో మేం సమాజ శ్రేయస్సును విశ్వసిస్తాం. మా ప్రయత్నాలన్నీ, వారి ఆరోగ్యంపై మానవ తప్పిదాలు కలిగించే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే దిశగా ఉంటాయి” అని చెప్పారు.
చాలా మంది ధూమపానం చేసేవారు దాన్ని ఆస్వాదిస్తున్నామని చెబుతారు. నికోటిన్ ఉపసంహరణ లక్షణాలు తగ్గడంతో పాటు తమకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తాయంటారు. సిగరెట్లు తాగే చాలా మంది దాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనకు భయపడతారు. ఎందుకంటే మానేసినప్పుడు వచ్చే లక్షణాలు తమను ఎక్కువగా ఇబ్బంది పెడతాయన్నదే వారి భయానికి మూలం. కానీ అమోర్ ఆస్పత్రి వైద్యులు బలమైన సంకల్పం, వైద్యసాయం ఉంటే ధూమపానం మానేయవచ్చని సలహా ఇస్తారు. వారు కోలుకోవడానికి సరైన మార్గంలో వారికి మార్గనిర్దేశం చేయగలరు.