రాళ్లు విసరడానికి సిగ్గుండాలి : అనిత
హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నాయకులపై రాళ్లు విసరడానికి కాస్తన్న సిగ్గు, శరం ఉండాలని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. బాధితుల పట్ల కొద్దిగ కూడా కనికరం చూపకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మహిళా ఛైర్‌పర్సన్‌గా ఉంటూ సాటి మహిళకు గౌరవం ఇవ్వకుండా చిన్న, పెద్దా తేడా లేకుండా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇక గురువారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పెద్ద పెద్ద రాళ్లను విసురుతూ వైసీపీ స్వైర విహారం చేశారు.
ఈ ఘటనలో నారా లోకేశ్ నిలుచున్న చోటుకు అతి సమీపంలో ఓ పెద్ద రాయి వచ్చి పడింది. అయితే ఈ ఘటనలో లోకేశ్‌కు ఏమీ కాకున్నా… వైసీపీ రాళ్ల దాడిని నిలువరించేందుకు యత్నించిన పోలీసులకు మాత్రం గాయాలయ్యాయి. వైసీపీ శ్రేణులు విరిసిన ఓ పెద్ద రాయి విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్సై తలపై పడింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం అయ్యింది. మరోవైపు వైసీపీ రాళ్ల దాడిలో మరో కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి.