హెచ్‌పీఎస్‌లో పుస్త‌కావిష్క‌ర‌ణ‌

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలోతేదీ. ఏప్రిల్‌ 24.2022 ఆదివారం స్కూల్‌ సొసైటీ అధ్యక్షుడు శ్రీ శ్యామ్‌ మోహన్‌ అనంతుల రాసిన “మేనేజర్లు , ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ కొరకు – పెబుల్స్‌, పెటల్స్‌ అండ్‌ పెర్ల్స్‌ అనే ఒక వృత్తాంత సంచికను విశాలమైన బేగంపేట, పాఠశాల ప్రాంగణంలోని విడుదల చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్‌, గౌరవనీయులైన శ్రీ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా
తమిళనాడు మాజీ గవర్నర్‌ శ్రీ పి.ఎస్‌. రామమోహనరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ శ్రీ సి.హెచ్‌. విద్యాసాగర్‌ రావు, హెచ్‌.పి.ఎస్‌. సొసైటీ మాజీ అధ్యక్షుడు, మాజీ పార్గమెంటు సభ్యుడు శ్రీ ఆర్‌. సురేందర్‌
రెడ్డి హాజరయ్యారు.

హెచ్‌ పిఎస్‌-బి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవ్‌ దేవ్‌ సారస్వత్‌ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. హెచ్‌ పిఎస్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌, శ్రీ గుస్తీ జె నోరియా తన ప్రసంగంలో – హెచ్‌ పిఎస్‌ పాఠశాలలు అందుకున్న ప్రశంసలతో సభికులను ఉత్తేజపరిచారు. హెచ్‌.పి.ఎస్‌ పాఠశాలల కోసం తాను ఊహించిన దార్శనికతను తెలియచేశారు. బేగంపేట, రామంతాపూర్‌ లోని హెచ్‌ పీ. ఎస్‌ పాఠశాలల శతాబ్ది, జూబ్లీ వేడుకల్లో భాగస్వాములు కావాలని సొసైటీ తరఫున ఆయన సభలో ఉన్న పూర్వ విద్యార్థులను ఆహ్వానించారు.

శ్రీ ఎం. గోపాలకృష్ణ (ఐ.ఎ.ఎస్‌ రిటైర్డ్‌) రచయితను పరిచయం చేస్తూ – శ్రీ శ్యామ్‌ మోహన్‌, హైదరాబాదు యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా, 80వ దశకంలో పూర్వపు ఆంధ్ర ప్రదేశ్‌ లో యాజమాన్య ఉద్యమానికి నాయకత్వం వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు.

శ్రీఎ శ్యామ్‌ మోహన్‌ ను సన్మానించారు. తర్వాత డాక్టర్‌ గౌతమ్‌ పింగ్లే ఈ పుస్తకాన్ని సమీక్షించారు. అనంతరం గౌరవనీయ గవర్నర్‌ శ్రీ బండారు దత్తాత్రేయ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
తదుపరి ముఖ్య అతిథి ప్రసంగం జరిగింది.

హెచ్‌ పిఎస్‌ సొసైటీ కార్యదర్శి, కోశాధికారి శ్రీ పైయాజ్‌ ఖాన్‌ గారు వందన సమర్పణ చేశారు. తమ శ్రావ్యమైన కంఠంతో స్కూల్‌ కోయిర్‌ జాతీయ గీతాన్ని ఆలపించడంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.