అలిగిన ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు లేవంటా ?
ఏపీలో రసవత్తరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లను మంత్రులను చేస్తావా నా తడఖా ఎంటో ఇప్పుడు చూపిస్తా… రాజకీయంలో తలపండిన వ్యక్తిని నన్ను కాదని నా ఇలాఖాలో నా బద్ద శత్రువుని మంత్రిని చేస్తావా అంటూ తమ అనంగ శిష్యులతో సీఎం జగన్‌మెహన్‌రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఈ కాకమ్మ బెదిరింపులకు బయపడేది లేదని మీ తప్పకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయా మాజీలకు, ఎమ్మెల్యేలకు కబురు వెళ్లిందంటా.
ఆ గిఫ్ట్‌ని చూసి వారి మతి పోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. సరే! ఇంతకీ ఈ రిటర్న్ గిఫ్ట్ ఏంటని అంటే.. ఆయా అసమ్మతి నేతలకు ఇంట్లోనే పొగపెట్టాలని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఎలాగంటే.. వారి వారి జిల్లాల్లో వారి వారి గ్రాఫ్ట్‌ని సర్వేలతో కొలిచి.. ఇదిగో ఇదీ.. మీ పనితీరు
అని మొహం మీద చూపించాలని నిర్ణయించుకుందట. అంతేనా.. అక్కడితో కథ అయిపోతుందా? అంటే.. కాదు.. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు.. మీ పనితీరును సర్వే చేయించాం.. ప్రజలు మిమ్మల్ని తిప్పికొడుతున్నారు. సో.. వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ లేదు. మీ తరఫున.. ఇక్కడ వేరేవారికి టికెట్లు ఇస్తున్నాం
అని కుండబద్దలు కొట్టబోతోందని.. అంటున్నారు. అంటే.. ఇప్పుడు నోరేసుకుని.. పడిపోయిన వారికి.. నోరు మూయించే కార్యక్రమానికి వైసీపీ అధిష్టానం.. రిటర్న్ గిఫ్ట్ రూపంలో షాక్ ఇవ్వనుందని అంటున్నారు తాడేపల్లి రాజకీయ నాయకులు. మరి నేతలు ఏం చేస్తారో చూడాలి.