స్మార్ట్ వెయిట‌ర్ కాలింగ్ ప‌రికరాన్ని ఆవిష్క‌రించిన పేట్‌పూజ‌



* ఇప్ప‌టివ‌ర‌కు 1500 ప‌రిక‌రాల‌ను ఏర్పాటుచేసిన పేట్‌పూజ‌, ప్ర‌తినెలా 2వేల ప‌రిక‌రాల ఏర్పాటు కోసం ఉత్ప‌త్తిని పెంచ‌నున్న సంస్థ‌



రెస్టారెంట్లలో భోజనం చేయడం అనేది ఆహారం లేదా అక్క‌డి వాతావరణం గురించి మాత్రమే కాదు, అక్క‌డ ఉండే మొత్తం అనుభవం. ఈ అనుభవాన్ని కస్టమర్లకు ఆహ్లాదకరంగా మార్చడం ద్వారా వెయిటర్లు రోజంతా రెస్టారెంట్ చుట్టూ అనేక మంది కస్టమర్లకు ఆహార, పానీయాల ట్రేలతో అటూ ఇటూ ప‌రుగులు తీస్తూనే ఉంటారు. సగటు వెయిటర్ రోజూ రెస్టారెంట్ లోపల 5-7 కిలోమీటర్లు నడుస్తాడు. వంటగదికి, కస్టమర్ల టేబుళ్ల‌కు మ‌ధ్య అనేకసార్లు అటూ ఇటూ వెళ్తూనే ఉంటాడు. ఈ విసుగుపుట్టించే, సమయ౦ తీసుకునే ఈ ప్రక్రియను మరి౦త సమర్థవ౦త౦గా చేయాలంటే ఏమి కావాలి?
ఈ సమస్యను పరిష్కరించడానికి, పేట్‌పూజ అనే కొత్త‌త‌రం రెస్టారెంట్ నిర్వ‌హ‌ణ ప్లాట్‌ఫాం అత్యాధునిక పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. దీనిద్వారా రెస్టారెంట్ బిల్లింగ్, ఇన్వెంటరీ, ఆన్లైన్ ఆర్డర్లు, మెనూ, కస్టమర్ల నిర్వహణ మ‌రింత సుల‌భంగా సాధ్య‌మ‌వుతుంది. ఇది ఒక వెయిట‌ర్ కాలింగ్ పరిక‌రాన్ని ఆవిష్క‌రించింది. ఇది చాలా సుల‌భ‌మైన‌, త‌క్కువ ఖ‌రీదులో దొరికే టెక్నాల‌జీ. దీని సాయంతో వెయిట‌ర్ల ప్ర‌యాస త‌గ్గి, వారి ప‌ని మ‌రింత సుల‌భం అవుతుంది.
ప్రతి కస్టమర్ టేబుల్ మీద ఒక చిన్న, వైర్ లెస్ పరికరం.. పేట్‌పూజ వారి వెయిటర్ కాలింగ్ డివైస్ ఉంటుంది. కస్టమర్లు వెయిటర్ల‌ను పిల‌వాల‌న్నా, నీళ్లు ఇవ్వాల‌న‌నా, బిల్లు కావాల‌న్నా ఒక బ‌ట‌న్ నొక్కితే చాలు. ప్రతి బటన్ వ‌ద్ద ఒక్కో ప్ర‌త్యేక‌మైన లైటు ఉంటుంది. ఇది పరికరానికి స్టైలిష్ లుక్ ని ఇవ్వ‌డంతోపాటు, కస్టమర్ ఏం అడిగారో వెయిట‌ర్ల‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కస్టమర్ బ‌ట‌న్ నొక్క‌గానే, పేట్‌పూజ వారి పీఓఎస్‌తో పాటు, వెయిట‌ర్ల వ‌ద్ద ఉండే కెప్టెన్ యాప్‌లో నోటిఫికేష‌న్ వ‌స్తుంది. ఇందులో ఏ టేబుల్ ద‌గ్గ‌ర ఏం కావాలో వెయిట‌ర్ల‌కు తెలుస్తుంది. దాంతో ఏం కావాలో అడ‌గ‌డానికి కస్ట‌మ‌ర్ల వ‌ద్ద‌కు ప‌దే ప‌దే వెళ్లే బ‌దులు వారికేం కావాలో తెలుసుకుని ఒకేసారి.. నేరుగా అదే టేబుల్ వ‌ద్ద‌కు వెళ్తే స‌రిపోతుంది. పేట్‌పూజ ఒక టీవీ బేస్డ్ యాప్‌ను కూడా ఆవిష్క‌రించింది. ఇది ఒక టీవీ స్క్రీన్ మీద క‌స్ట‌మ‌ర్లు ఏం అడిగారో చూపిస్తుంది, వెయిట‌ర్ల‌లో ఎవ‌రు అందుబాటులో ఉంటే వాళ్లు ఆ టేబుల్ వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి వీలు క‌ల్పిస్తుంది.
ఇప్పటి వరకు 1500కు పైగా పరికరాలను తయారు చేసి, ఏర్పాటు చేసిన పేట్‌పూజ‌.. భ‌విష్య‌త్తులో నెల‌కు 2వేల ప‌రిక‌రాల‌ను ఉత్పత్తి చేసి, ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. దీని కోసం ఈ వేదిక ఒక ప్రసిద్ధ తయారీదారుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కొక్కటి రూ. 750 ధర కలిగిన ఈ పరికరాలు చాలా సరసమైనవి. వీటిని ఇప్ప‌టికే యమ్ యమ్ చా, బెర్కోస్, ఇండియన్ సమ్మర్ వంటి ప్రసిద్ధ రెస్టారెంట్లలో వాడుతున్నారు. హాకో, బీర్ కేఫ్ వద్ద పైలట్ దశలో ఉన్నాయి.
దీని గురించి పేట్‌పూజ‌ గ్రోత్ వైస్ ప్రెసిడెంట్ శైవల్ దేశాయ్ మాట్లాడుతూ, “పెద్ద, బిజీగా ఉండే రెస్టారెంట్లలో వెయిటర్లు, కస్టమర్ల అవ‌స‌రాలు తీర్చడానికి రెస్టారెంట్ చుట్టూ రోజంతా ప‌రుగులు పెట్టి అలసిపోతారు. కస్టమర్లు కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. రద్దీ సమయాల్లో ఇది మ‌రింత ఎక్కువ అవుతుంది. కొవిడ్ తీవ్ర‌త తగ్గుతున్నందున, వినియోగదారులు మంచి డైన్-ఇన్ అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు. రెస్టారెంట్లలో జనసమూహాల సందడి క‌నిపిస్తోంది.
మా కొత్త వెయిటర్ కాలింగ్ ప‌రిక‌రం కస్టమర్లకు సేవ చేయడంలో వెయిట‌ర్ల సామర్థ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఇది కస్టమర్ల‌కు ఏం కావాలో వెయిటర్లకు తక్షణమే తెలియజేస్తుంది. కస్టమర్ సర్వీసును మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంది. రెస్టారెంట్లలో వేచి ఉండే, క‌ష్ట‌త‌ర‌మైన ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంలో డ‌బ్ల్యుసీడీ సాయపడుతుంది. ఈ పరికరాలు చిన్నవి, స్టైలిష్ గా ఉన్నాయి. వీటిని ఇప్పటికే అనేక రెస్టారెంట్లలో వాడుతున్నారు. డ‌బ్ల్యుసీడీకి రెస్టారెంట్లు, కస్టమర్ల నుంచి ప్రతిస్పందన వ‌స్తోంది. ఇది కస్టమర్ సర్వీసును వేగవంతం చేస్తుంది. రెస్టారెంట్లకు గేమ్ ఛేంజర్ గా రుజువవుతోంది. మరిన్ని రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను అప్ గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా పరికరాల ఉత్ప‌త్తిని మేం మ‌రింత విస్త‌రిస్తున్నాం” అని తెలిపారు.