కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఆఫ‌ర్‌

భారతదేశపు ప్రముఖ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్‌ పోస్ట్ DHL గ్రూప్‌లో భాగమైన బ్లూ డార్ట్ కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ ప్రియమైన వారికి నూతన సంవత్సరపు ఆనందాన్ని, ఆప్యాయతను బహుమతులు, స్వీట్లు, మరెన్నో ఇతర రూపాల్లో పంపించేందుకు ఉగాది ఎక్స్‌ప్రెస్‌ వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలకు చేరుకునేలా ఉగాది ఎక్స్‌ప్రెస్ అత్యున్నతమైన, విశ్వసనీయమైన సేవలను తగ్గింపు ధరలకు అందిస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా కస్టమర్లు 5 కిలోల బరువున్న అంతర్జాతీయ షిప్‌మెంట్స్‌పై 40% తగ్గింపు, 10 కిలోల నుంచి 20 కిలోల మధ్య బరువుండే అంతర్జాతీయ షిప్‌మెంట్స్‌పై 50% తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 02, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
కస్టమర్లకు అత్యున్నత అనుభూతి అందించేందుకు బ్లూడార్ట్‌ ఎప్పుడూ దృష్టి సారిస్తుంది కాబట్టి పోటీ వాతావరణంలో దానిని వేరుగా నిలబెడుతుంది. కస్టమర్ల నాడిని పట్టుకొని వారికి అవసరం ఏర్పడకముందే సంబంధిత సేవలు ప్రవేశపెడుతూ ఈ బ్రాండ్‌ విజయవంతంగా నిలుస్తోంది.
బ్లూ డార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు మహమ్మారిని ‘స్థానికమైనది’ అని సంబోధించడానికి, అంగీకరించడానికి ఆసక్తిగా ఉన్నారు. అయినప్పటికీ ఆ అంటువ్యాధి భయం మాత్రం వీడటం లేదు. కొత్త సంవత్సరం వేళ ప్రియమైనవారి సమక్షంలో ఉండటం, బహుమతులు, స్వీట్లు, మరెన్నో అందుకోవడం పండగ స్ఫూర్తి నింపేందుకు అవసరం. మహమ్మారి భయం కారణంగా మా కస్టమర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి విశ్వసనీయమైన, ప్రతిస్పందనతో కూడిన పరిష్కారాన్ని అందించేందుకు మేము ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ప్రారంభించాం. మా కస్టమర్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి ప్రియమైన వారి సాన్నిహిత్యాన్ని, చేయూతను అందుకునేందుకు అర్హులు. మహమ్మారి దూరాలను పెంచినప్పటికీ బ్లూ డార్ట్ తన కస్టమర్లకు వారి సరుకులను ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్లడం, అందజేయడం ద్వారా ప్రపంచం ఒక చిన్న ప్రదేశంగా కొనసాగేలా చూసేందుకు కృషి చేస్తుంది.
ఎల్లప్పుడూ కస్టమర్-కేంద్రీకృతంగా ఉంటూ భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే సాంకేతిక పరిష్కారాలను నిరంతరం మెరుగుపరుస్తూ పనిచేసే సంస్థ బ్లూ డార్ట్. సాంకేతిక సామర్ధ్యం, సమ్మిళిత తత్వం, ప్రజల సంస్కృతితో పాటు ప్రతి స్థాయిలోనూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించడం బ్రాండ్‌ మార్కెట్‌ నాయకత్వానికి నిదర్శనం. బిల్లింగ్, కలెక్షన్‌, చెల్లింపు సహ మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసిన కాంటాక్ట్ లెస్ డెలివరీ ఫీచర్‌ ద్వారా కస్టమర్లు నిరంతరాయమైన లాజిస్టిక్స్ అనుభూతి పొందవచ్చు. కస్టమర్లకు ఎంచుకునేందుకు 16 డిజిటల్ వాలెట్‌లు, QR కోడ్, UPI ఇంటర్‌ఫేస్ (BHIM), క్రెడిట్ & డెబిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌ సహా అనేక రకాల చెల్లింపు విధానాలు అందుబాటులో ఉన్నాయి. యాపిల్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేలో అందుబాటులో ఉన్న ‘My Blue Dart’ యాప్ ద్వారా కస్టమర్లు వారి ప్యాకేజీని ట్రాక్ చేసుకోవచ్చు. వేర్వేరు ప్రాంతాలకు షిప్‌మెంట్స్‌ పంపించేందుకు అత్యంత తక్కువ ఖరీదైన విధానాన్ని కనుగొనవచ్చు. అలాగే ముఖ్యమైన సంప్రదింపు సమాచారాన్నిఅత్యంత యూజర్‌ ఫ్రెండ్లీ విధానంలో యాక్సెస్‌ చేసుకోవచ్చు.
www.bluedart.comలో సమీప బ్లూ డార్ట్ కౌంటర్‌ కనుగొనండి
బ్లూ డార్ట్ సేవలు పొందేందుకు లేదా ఏవైనా తదుపరి విచారణల కోసం కస్టమర్లు కింది కస్టమర్ కేర్ నంబర్ – 1860 233 1234కు కాల్ చేయవచ్చు లేదా [email protected]లో మాకు ఈమెయిల్ చేయవచ్చు.