విశాఖలో మైల్యాబ్ కేంద్రం
భారతదేశపు ప్రముఖ బయోటెక్ కంపెనీ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ విశాఖపట్నంలోని AMTZ వద్ద నూతన తయారీ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడి అధిక నాణ్యత గల అనేక రకాల మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ పరికరాలను తయారుచేస్తుంది. అలాగే కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ విభాగం భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ట్రాన్సఫర్మేటివ్ మాలిక్యులర్ పరీక్షల కోసం రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి అనుగుణంగా, ఖచ్చితమైన, సత్వర రోగ నిర్ధారణ పరీక్షలు జరిపేలా ఏర్పాటవుతుంది.
ఈ సందర్భంగా మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ మార్కెటింగ్ మానేజర్ శ్రీ దేబాశ్రీ డేగారు మాట్లాడుతూ “ఇది మాకు గుర్తుండిపోయే సందర్భం. మై ల్యాబ్ ఉత్తేజంతో నిండిన, అభివృద్ధి పథంలోకి ప్రవేశిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రోగ నిర్ధారణకు సంబంధించి సరికొత్త పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మా తయారీ కేంద్రాలను విస్తరించడం వల్ల దేశీయంగా ఉత్పత్తి సామర్ధ్యం బలోపేతం కావడమేగాక, రేపటిరోజుకు కావలసిన రోగ నిర్ధారణ కిట్ లను తయారుచేయడానికి వీలౌతుంది. రోగులకు మెరుగైన సేవలను అందించడానికి, ప్రపంచం నలు మూలలా ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, నూతన రోగ నిర్ధారణ పరికరాలు, విధానాలను అందుబాటులోకి తేవడానికి AMTZతో కలిసి పనిచేయడం మాకు సంతోషంగా ఉంది” అన్నారు.
నూతన విభాగం వల్ల ప్రస్తుతం ఉన్న రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం. 5,00,000 per day .రెట్లకు పెరుగుతుంది, దాదాపుగా…..ఉద్యోగాలు లభిస్తాయి. అత్యాధునిక సాంకేతికతను వాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపరిచడానికి రోగనిర్ధారణ, చికిత్సలకు అవసరమైన పరికరాలను ఈ విభాగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన వ్యక్తులు తయారుచేస్తారు.
ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ మానేజింగ్ డైరెక్టర్ & సి.ఇ.ఓ. డా. జితేంద్ర శర్మ మాట్లాడుతూ “డయాగ్నోస్టిక్స్ రంగంలో మైల్యాబ్ సంస్థ గేమ్ చేంజర్ గా నిలిచింది, కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో ముందంజలో నిలిచింది. దేశీయంగా రోగ నిర్ధారణ ఉత్పత్తుల తయారీని వేగవంతం చేయడానికి, ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలకు సహాయకారి, మార్గదర్శి అయిన సంస్థగా AMTZ స్థానాన్ని బలోపేతం చేయడానికి మైల్యాబ్ కలయిక AMTZకి ఉపయోగపడుతుంది” అన్నారు.
నూతన తయారీకేంద్రం నిర్మాణదశలో ఉంది. అవసరమైన అన్ని అనుమతులు వచ్చిన తరువాత June 2022 నుండి అధికారికంగా పనులను ప్రారంభిస్తుంది.