నా మాట‌ల‌తో రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నారు : చిన్న జీయ‌ర్

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన చిన్న జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. త‌న మాట‌ల‌తో కొంత‌మంది రాజ‌కీయ ల‌బ్ద‌పొందాల‌ని చూస్తున్నార‌ని కోణంలో ఆయ‌న మాట‌లు ఉన్నాయి. విజయకిలాద్రీ క్షేత్రంలో వార్షక బ్రహ్మోత్సవాలు నిర్వహించి తిరువిధి ఉత్సవంలో పాల్గోన్నారు చినజీయార్. లక్ష్మిఅమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉత్సావాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజులనుండి తమ పై వస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని పూర్వపరాలు పరీశీలించిన తర్వాతనే ఎవరిపైననైన నిందనలు మోపాలని, కానీ కావలనే కొందరి స్వార్ధం కోరకు పబ్లీసిటి, మీడీయాలో కనబడలన్న దురుద్ద్యేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూన్నారన్నారు. తము ఎప్పూడూ వన దేవతలను దురుద్యేశంతో చూడలేదని, మహిళలు, గిరిజనులు అంటే తమకు ఎంతో గౌరవమన్నారు. ఎవరైన సమాజహీతం కొరకు పాటుపడేలే తప్ప ప్రజలను రెచ్చకొట్టే కార్యక్రమాలు చేయకూడదని సూచించారు. 20 సంవత్సరాల క్రితం అన్న మాటలను ఇప్పుడు కావలనే వక్రీకరస్తూన్నారని తెలిపారు. తాము రాజకీయల్లోకి వస్తూన్నరన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.యాదాద్రి ప్రారంభోత్సవానికి పిలుపు అందకపోవడంలో అంతర్యం ఎమిటన్న ప్రశ్నకి సమాదానంగా తమను పిలవని కార్యక్రమాలకు వెళ్లమని మేము పూసుకుతిరిగే వాళ్లం కాదని,సలహలు చెప్పడామే తమ భద్యత అని వివరించారు.పిలుస్తే తప్పక వెలుతామని లేకుంటే చూసి ఆనందిస్తామన్నారు.

‘20ఏళ్ల క్రితం జరిగిన విషయంపై ఇప్పుడు దుష్ర్పచారం చేస్తున్నారు’. ఆదివాసీ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. 20ఏళ్ల క్రితం జరిగిన విషయంపై ఇప్పుడు దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. పూర్వపరాలు తెలుసుకోకుండా మధ్యలోంచి విషయం తీసుకుని విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. తాము అందరినీ సమదృష్టితో చూస్తామని చిన జీయర్ స్పష్టంచేశారు.