రెడ్డిల‌ను ఆదుకొండి : ఘ‌ట్‌కేస‌ర్ రెడ్డి సంఘం

రెడ్డి కులంలో చాలా మంది పేద రెడ్డిలు ఉన్నార‌ని వారిని ప్ర‌భుత్వం ఆదుకోవాని డిమాండ్ చేశారు ఘ‌ట్‌కేస‌ర్ రెడ్డి సంఘం నాయ‌కులు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ,అసెంబ్లీలో 2022- 23 బడ్జెట్ లో రెడ్డి కార్పొరేషన్ ప్రకటించనందుకు మరియు పేద రెడ్ల అభివృద్ధి కి నిధులు కేటాయించనందుకు నిరసనగా *అసెంబ్లీ ముట్టడి * కార్యక్రమంలో బాగంగా ఘట్కేసర్ రెడ్డి సంఘం కార్యవర్గ సబ్యులను ముందస్తు అరెస్ట్ చేశారు. గత 2 నెలల క్రితం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రెడ్డి జాగృతి వేదిక ద్వారా పాదయాత్ర ప్రకటన చేసిననాటి నుండి “పాదయాత్ర, జనగాం సభ, రెడ్ల నిరసనదీక్ష” ల పేరుతో ఈ రోజుకి సుదీర్ఘంగా 2 నెలలుగా కంటిన్యూగా ఉద్యమం కొనసాగుతుండడం ఒక చరిత్ర. ఏ కులహక్కుల ఉద్యమం అయిన దశల వారిగా మాత్రమే జరిగింది కానీ రెండు నెలల సుదీర్ఘంగా జరుగలేదు. కానీ రెడ్డి కార్పొరేషన్ కోసం 2 నెలుగా మనం చేస్తున్న ఈ ఉద్యమం మహోన్నత మైనది, ఇది రెడ్లకు గర్వకారణం. ఇదే స్ఫూర్తితో 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఘట్కేసర్ రెడ్డి సంఘం తరపున ప్రభుత్వానికి తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి చందుపట్ల వెంకట్ రెడ్డి , ఉపాధ్యక్షులు పలుగుల శ్రీకాంత్ రెడ్డి , ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొమ్మిడి రాజేశ్వర్‌ రెడ్డి , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోంతం అంజిరెడ్డి , బోక్క సత్తిరెడ్డి , గడీల ప్రభాకర్ రెడ్డి , కోంతం నర్సింహ రెడ్డి , బద్దం క్రిష్ణరెడ్డి , సోసైటీ డైరక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి , కందాటి వెంకట్ రెడ్డి , పాల్గొన్నారు.