బీజేపీ పోరాటం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్: హైమా రెడ్డి
తెలంగాణ ఏర్పడ్డాక అప్పులు పెరిగాయని అన్నారు మేడ్చల్ జిల్లా భాజపా నాయకురాలు హైమా రెడ్డి. కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం రూ.2 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. బీజేపీ పోరాటం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య పరిష్కారమైందని చెప్పారు. అవినీతి బయటపడుతుందనే కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వలేదన్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.లక్ష కోట్లకు పెంచారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చుట్టూ కబ్జాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.