1000 మంది మహిళల మైలు రాయిని చేరుకున్న హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్

1938లో హైదరాబాద్ రేడియో హౌస్ గా ప్రయాణం ప్రారంభించిన హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్ అనతి కాలలో శాఖోపశాఖలుగా విస్తరించి దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న డొమెస్టిక్ కాంటాక్ట్ సెంటర్లలో ఒకటిగా నిలిచింది. దీనికి హైదరాబాద్, బెంగళూరు, కొయంబత్తూరులలో కార్యాలయాలు కలవు.
2007లో 20 మంది ఉద్యోగులతో ప్రస్థానం ప్రారంభించిన హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్ లో ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 2800 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో వెయ్యి మంది మహిళా ఉద్యోగులే ఉన్నారు. హైదరాబాద్ లో ఈ మైలురాయిని చేరుకున్న 50 కంపెనీల్లో ఒకటిగా హె ఆర్ హెచ్ నెక్స్ట్ కూడా ఒకటి. సంస్థ సాధించిన ఈ ఘనతను మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించినట్టు సంస్థ ఈసీఓ అంకిత్ షా తెలిపారు.
రాయల్టన్ హైదరాబాద్ హోటల్ లో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. తెలంగాణ మాజీ ఏడీజీ, ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సజ్జనార్ మాట్లాడుతూ.. ‘మహిళల భద్రత, సంరక్షణ, సాధికారతకు హెచ్ఆర్ఎక్స్ సంస్థ ఎంతటి ప్రాధాన్యతనిస్తుందోననే విషయం మనకు అర్థమవుతోంది. వెయ్యిమంది మహిళా ఉద్యోగులతో కలిసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మహిళా సాధికారత విషయంలో వారి అంకితభావానికి నిదర్శనం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే, మహిళల భద్రత, సాధికారత అనే అంశాలు ఎవరో మనకు ఇచ్చేవి కావు. వీటిని మనం సాధించుకోవాలనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు చెప్పదలచుకున్నాను’ అని అన్నారు.
వివిధ ఐటీ , ఎంఎన్సీ కంపెనీల ఇంటర్నల్ కమిటీల్లో ఎక్స్ట్ టర్నల్ మెంబర్ గా ఉంటూ కంపెనీలో PoSH చట్టాన్ని అమలుచేసిన జ్యోతి దాస్ మరో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజుల్లో కేవలం చదువుకుంటే సరిపోదని, హక్కుల గురించి , చుట్టూ జరుగుతున్న అన్యాయాల గురించి కూడా తెలిసి ఉండాలని జ్యోతి దాస్ చెప్పారు. తప్పొప్పులకు మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించాలన్నారు. అప్పుడే అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిన వారిని చట్టం శిక్షిస్తుందని చెప్పారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలను కట్టడి చేసే దిశగా మహిళా చట్టాలు కూడా నేడు బలోపేతమవుతున్నాయని, వర్కింగ్ వుమెన్ విషయంలో చట్టాలు మరింత పదునుగా ఉన్నందున ఎవరూ భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. పనిచేస్తున్న సంస్థల్లో లైంగిక వేధింపుల నుంచి సంస్థ అంతర్గత విధానాల వరకు విషయం ఎలాంటి దైనా ఇప్పుడున్న చట్టాలు మహిళలకు అండగా ఉంటున్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ తమ విధులు, బాధ్యతల గురించి తెలుసుకుని హక్కుల కోసం పోరాడాలని కోరారు. ఆ దిశగా చైతన్యం చేయడంతో పాటు న్యాయం జరిగేలా చేయడానికి తానెప్పుడూ సిద్దంగా ఉంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ బోధకురాలు శ్రీ దివ్య రావు గారు ప్రతి వ్యక్తిలో ఉండే అపరిమితమైన శక్తిని , సరైన రీతిలో రగిలించడం గురించి చర్చించారు.
మహిళలు తమ రోజు వారీ జీవితంలో తక్షణ శక్తిని , ఉత్తేజాన్ని పొందేందుకు దోహదం చేసే భస్త్రిక అనే అద్భుతమైన విధానాన్ని కూడా ఆమె ప్రదర్శించి చూపించారు.