మహిళలు ధైర్యంగా ఉండాలి : డీఎస్పీ శృతి
ప్రతి మహిళా ధైర్యంగా ఉన్నప్పుడే సమాజంలో తలెత్తుకొని జీవించగలరని అన్నారు ఆత్మకూరు డీఎస్పీ వై.శృతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో నేటి ప్రపంచంలో మహిళా సాధికారత అనే అంశంపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో డాక్టర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ఆ సమయంలో వారు తమ కుటుంబాలను త్యాగం చేసి కోవిడ్ రోగుల కోసం పని చేశారని ఆ త్యాగం వెలకట్టలేదని పేర్కొన్నారు. ఎవరి గురించే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. భరించలేని బాధలు కలిగినప్పుడు పక్కన ఉన్న వారికి చెప్పుకోవాలి లేదంటే తల్లిదండ్రులు చెప్పుకోవాలన్నారు. పరిస్థితులు దాటి వెళ్లిపోతున్న సమయంలో తప్పని సరిగా కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు సమయంలో పెళ్లికి ముందే మీ బాధ్యతల గురించి మీ కాబోయే భర్తలకు వివరించాలని సూచించారు. మరోవైపు పిల్లల్ని కనడం అనేది మన స్వంత విషయం అంతేకానీ వయసు అయిపోతుందని, ఇంట్లో పెద్దవారు ఇబ్బందులకు గురిచేస్తే మీరు నిర్ణయం తీసుకోవద్దన్నారు. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తును ఇస్తాం అనుకున్న తరుణంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
అనంతరం హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ మహిళలు విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి సాధించగలుగుతాం. అంతేకానీ కట్టుబాట్లు పెట్టి స్త్రీలను ఇంట్లో నిర్భంధించడం సరికాదన్నారు. అనంతరం హాస్పిటల్స్ నర్సింగ్ సిబ్బంది, ఆడ్మిన్ మహిళా సిబ్బందితో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు ఛైర్మన్ డా. సుధాకర్, ఎండీ డా. రఫీక్ అహ్మాద్, డైరెక్టర్ డా. నవీద్, సీఓఓ రంజిత్ రెడ్డి, పెద్ద సంఖ్యలో నర్సులు, సహాయ సిబ్బంది హాజరయ్యారు.