మంత్రి హత్య కుట్ర‌…వారి వ్యుహమేనా ?

మంత్రి శ్రీ‌నివాస్ హ‌త్య‌కుట్ర వెనుక అనుమానాలు వ‌స్తున్నాయి. హ‌త్య చేయ‌డానికి దాదాపు 15 కోట్లు సుపారీ చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంధ్ర తెలిపారు. అయితే ఈ హత్యలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన భార‌తీ జ‌న‌తా పార్టీ నేత‌లు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేంద్ర‌రెడ్డి ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఈ కుట్ర‌లో మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉండ‌డంతో మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అయితే ఈ విషయంపై మాజీ మంత్రి డీకే అరుణ ఓ టీవీ ఛానెల్ ఫోన్ ఇన్‌లో స్పందించారు. శ్రీ‌నివాస్ గౌడ్‌
మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి నుండి అక్క‌డ అర‌చాక పాల‌న కొనసాగుతోంద‌న్నారు. ఎక్క‌డా కూడా అత‌ని ఫోటోలే త‌ప్పా వేరు వారివి కనిపించ‌కుండా చేసే ద‌గ్గ‌ర నుండి పెద్ద పెద్ద డీలింగ్‌ల వ‌ర‌కు కూడా ఆయ‌న రాసిన‌దే రాజ్యంగంగా మారింది.

కాగా శ్రీ‌నివాస్‌గౌడ్ ఢిల్లీలో కొంత‌మందిని కిడ్నాప్ చేయించార‌ని, కిడ్నాప్ గురైన భార్య‌లు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ త‌మ భ‌ర్త‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని తెలిపారు. అయితే గ‌త కొన్ని రోజులుగా శ్రీ‌నివాస్ గౌడ్ ఎన్నిక‌ల అఫ‌డివిట్‌లో త‌ప్పులు చూపించార‌ని మంత్రి కేసులు వేశారు. వారినే ఢిల్లీలో మంత్రి కిడ్నాప్ చేయించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కాగా వారికి మాజీ మంత్రి జితేంద్ర‌రెడ్డి ఢిల్లీలో ఆశ్ర‌యం క‌ల్పించార‌ని తెలుస్తోంద‌ని సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు.

అయితే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా తెర మీద‌కు వ‌స్తున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో తెరాస అధికారంలోకి తీసుక‌రావ‌డానికి బాధ్య‌త‌లు మీద వేసుకున్నారు ప్ర‌శాంత్ కిషోర్‌. ఇందులో భాగంగానే శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్యకు కుట్ర అనేది తెర మీద‌కు వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు ఉంటాయి కానీ హ‌త్య‌ల వ‌ర‌కు వెల్ల‌రంటున్నారు వారు.

ఇటీవ‌ల కాలంలో తెలంగాణలో అధికార పార్టీకి ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన బీజేపీని ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టాల‌ని చూసినా… ఓ ఒక్క ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు. ఇటీవ‌ల తెరాస కోసం ప‌ని చేస్తున్న పీకే టీం… ఈ అంశాన్ని తెర మీద‌కు లాగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి ఇది పీకే టీం వ్యుహాంలో భాగ‌మైతే మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఒక మంచి రాజ‌కీయ అంశం దొరిన‌ట్టే. దీనిపై ఇరు పార్టీల నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.