శ్రీలంకను చిత్తు చేసిన భారత్
మొదటి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసింది టీం ఇండియా. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వీర విజృంభణతో భారత్ తొలుత 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 200 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
భారత జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇషాన్ 56 బంతుల్లో 10 ఫోర్లు మూడు సిక్సర్లతో 89 పరుగులు చేయగా, అయ్యర్ 28 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ రేపు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.