నేడు ముంబాయికి సీఎం కేసీఆర్
దేశంలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కేంద్రంలో మోడీని గద్దే దించాలని కొన్ని రాష్ట్రాల సీఎంలు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సీఎంలు ఒక వేధికపై వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ అంశంపై ఫోన్‌లో చర్చింనట్లు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే మూడో ఫ్రంట్ విషయంలో చర్చించడానికి ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబాయి బయలుదేరనున్నారు. ఉద్దవ్‌థాక్రే పిలుపు మేరకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఆయా రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ భేటీ ఉండనుంది.