ట్రూక్ ఎయిర్ బడ్స్,

ఫిబ్రవరి 18 2022: భారతదేశ అగ్రగామి ఆడియో బ్రాండ్ అయిన ట్రూక్ తాజాగా తన నూతన టీడబ్ల్యూఎస్ సిరీస్, ఎయిర్ బడ్స్, ఎయిర్ బడ్స్+ లను ఆవిష్కరించింది. సౌండ్ సంబంధిత వృత్తినిపుణులకు, సంగీత ప్రియులకు అధిక నాణ్యమైన వైర్లెస్ స్టీరియోలు, వైర్లెస్ హెడ్ ఫోన్లు, యర్ ఫోన్లు, బీస్పోక్ అకౌస్టిక్ ఉపకరణాలు అందించడంలో ఈ సంస్థ పేరొందింది. తాజా ఉత్పాదనలు స్మార్ట్ అప్లికేషన్ ద్వారా కస్టమైజ్ చేసుకోగల రీతిలో 20 ప్రిసెట్ ఈక్యూ మోడ్స్, నాయిస్ కేన్సిలేషన్, డెడికేటెడ్ గేమింగ్ మోడ్ లతో వినియోగదారులకు ప్రీమియర్ యూజర్ అనుభూతిని అందిస్తాయి. వెల రూ.1599. ట్రూక్ ఎయిర్ బడ్స్ ఫ్లిప్ కార్ట్ పై మాత్రమే నేటి నుంచి లభిస్తాయి. ఎయిర్ బడ్స్+ ఫ్లిప్ కార్ట్ తో పాటుగా అమెజాన్ లోనూ రూ.1699లకు లభిస్తాయి.
రెండు టీడబ్ల్యూఎస్ లు కూడా అత్యున్నత స్థాయి ఫీచర్లతో ఉంటాయి. స్మార్ట్ అప్లికేషన్ ద్వారా కస్టమైజ్ చేసుకోగల రీతిలో 20 ప్రిసెట్ ఈక్యూ మోడ్స్, మరింత సుసంపన్న, లీనమయ్యే అనుభూతి కోసం యూజర్ మ్యూజిక్ / సౌండ్ ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పించడం వంటివి వీటిలో ఉన్నాయి. 300 ఎంఏహెచ్ చార్జింగ్ కేసులో
40 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఇయర్ బడ్స్ సింగిల్ చార్జ్ తో 10 గంటల దాకా, కేస్ తో మొత్తం 48 గంటల దాకా ప్లేబ్యాక్ టైమ్ ను కలిగిఉంటాయి. ఇవి టైప్ సి చార్జింగ్ పోర్ట్ తో వస్తాయి. మెరుగుపర్చబడిన కాల్ క్వాలిటీ కోసం ఈ ఇయర్ బడ్స్ క్వాడ్ ఎంఇఎంఎస్ మైక్ (ప్రతీ ఇయర్ బడ్ లోనూ డ్యూయల్ మైక్) తో రూపుదిద్దుకున్నాయి. ఏఐ- పవర్డ్ నాయిస్ కేన్సిలేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ఆటో ఇన్ – ఎయిర్ ప్రిసిషన్ కాంటాక్ట్ సెన్సర్ కూడా కలిగి ఉంటుంది. వేరింగ్ స్టేటస్ పై రియల్ టైమ్ డిటెక్షన్ ను అందిస్తుంది. ఇయర్ బడ్ ను లోపల / బయట పెట్టుకున్నారా అనే దాన్ని బట్టి మ్యూజిక్ ప్లే అయ్యేందుకు / పాజ్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
పొడిగించబడిన బ్యాటరీ జీవితానికి అదనంగా, మెరుగుపర్చబడిన కనెక్టివిటీ, అధికం చేయబడిన ఫిట్ లతో ఇది 55ms దాకా అల్ట్రా లో లేటన్సీ తో డెడికేటెడ్ గేమింగ్ మోడ్ ఫీచర్ ను కూడా అందిస్తుంది. తద్వారా అత్యుత్తమ గేమింగ్ అను భూతిని అందిస్తుంది. భద్రంగా ఫిట్ అయి ఉండే ఫెదర్ లైట్ ఇయర్ ఫోన్స్ రోజంతా కూడా సౌకర్యాన్ని అందించేలా ఎర్గో నామికల్ గా రూపొందించబడ్డాయి. సాధ్యమైనంత ఫిట్ ను అందించేందుకు వీలుగా 45 డిగ్రీల వద్ద కచ్చితమైన రీతిలో టిల్ట్ చేయబడ్డాయి.
ఈ ఆవిష్కరణ సందర్భంగా ట్రూక్ ఇండియా సీఈఓ శ్రీ పంకజ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, సౌండ్ వేర్, సోనిక్ యాక్సెస రీస్ విభాగంలో పరిపూర్ణ యూజర్ అనుభూతిని అందించేలా, శక్తి, పనితీరు, అందుబాటు ధరతో సమ్మిళితమయ్యే అత్యుత్తమ ఉత్పాదనలను అందించేందుకే ట్రూక్ ఎన్నటికీ ప్రయత్నిస్తుంటుంది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ను ఆధారం చేసుకొని మేం నిరంతరం మా ఉత్పాదనల నాణ్యతను మెరుగుపరుస్తూ ఉంటాం. అందుకే నేడు మేం అన్ని ఇ-కామర్స్ వేదికలపై కూడా అత్యధిక రేటింగ్ కలిగిన ఉత్పాదనలను అందించగలుగుతున్నాం. ప్రధానంగా హెడ్ సెట్ మార్కెట్ పైనే దృష్టి పెడుతూ, ఎయిర్ బడ్స్, ఎయిర్ బడ్స్+ ను ప్రవేశపెడు తున్నందుకు గాను మేం ఎంతగానో గర్విస్తున్నాం. పరిపూర్ణ శ్రవణ అనుభూతిని అందించేలా ఈ ఉత్పాదనలు డిజైన్ చేయబడ్డాయి. వివిధ ఉపవిభాగాల్లో పటిష్ఠ ఉనికితో ట్రూక్ మొదటి నుంచి కూడా మార్కెట్ లీడర్ గా ఉంటోంది. భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న సౌండ్ వేర్ బ్రాండ్లలో ఒకటిగా మేం పరిశ్రమలో పటిష్ఠ స్థానంలో ఉన్నాం. 2021 రెండో త్రైమాసికంలో టీడబ్ల్యూఎస్ విభాగంలో మేం సుమారుగా 5 శాతం వాటా కలిగిఉన్నాం. ఈ నిర్దిష్ట ఉత్పాదనల ఆవిష్కరణతో, డెడికేటెడ్ గేమింగ్ మోడ్, 55 ఎంఎస్ దాకా అల్ట్రా లో లాటెన్సీ, అందుబాటు ధర శ్రేణితో అత్యుత్తమ గేమింగ్ అనుభూతిని అందించాలన్నది మా లక్ష్యం. మా ప్రతి ఉత్పాదన కూడా వినూత్నత స్ఫూర్తితో, మెరుగైన సాంకేతికతతో రూపుదిద్దుకుంది. మా వినియోగదారులు పరిపూర్ణ శ్రవణ అనుభూతిని పొందగలుగుతారని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
ఇటు వృత్తి నిపుణులకు, అటు సంగీత అభిమానులకు అధిక నాణ్యమైన హెడ్ ఫోన్స్ ను, హెడ్ సెట్స్ ను అందించడం లో ట్రూక్ ఎన్నో ఏళ్ల అనుభవాన్న కలిగిఉంది. తన ఉత్పాదన పోర్ట్ ఫోలియోకు ఎయిర్ బడ్స్, ఎయిర్ బడ్స్+ ను జోడించ డం అనేది అత్యుత్తమ యూజర్ అనుభూతిని అందించేందుకు వీలుగా వినూత్నత, నిరంతర అభివృద్ధి పట్ల ఈ బ్రాండ్ కు గల మక్కువను తెలియజేస్తుంది.

ఈ విభాగంలోనే మొదటిసారిగా, స్మార్ట్ అప్లికేషన్ ద్వారా కస్టమైజ్ చేసుకోగల రీతిలో
20 ప్రిసెట్ EQ మోడ్స్ తో ఎయిర్ బడ్స్, ఎయిర్ బడ్స్+ ను ప్రవేశపెట్టిన ట్రూక్
స్మార్ట్ యాప్ సపోర్ట్, కస్టమైజబుల్ ఈక్యూ, 20 ప్రిసెట్ మోడ్స్, క్వాడ్ – మైక్, ఐఏ పవర్డ్ నాయిస్ కేన్సిలేషన్, ఆటో ఇన్-ఎయిర్ డిటెక్షన్, అత్యుత్తమ గేమింగ్ అనుభూతిని అందించేలా గేమింగ్ మోడ్ లతో ట్రూక్ ఎయిర్ బడ్స్ సిరీస్

ముఖ్యాంశాలు:
స్మార్ట్ అప్లికేషన్ సపోర్ట్ : రెండు టీడబ్ల్యూఎస్ లు కూడా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా సపోర్ట్ చేయబడుతాయి. అది వినియోగదారులు గేమింగ్ మోడ్ లోకి వెళ్లేందుకు, ఇన్ –ఇయర్ సెన్సర్ ను ఎనేబుల్ చేసేందుకు, 20 ప్రిసెట్ ఈక్యూల నుంచి ఎంపిక చేసుకునేందుకు లేదా తమ సొంత సిగ్నేచర్ ఈక్యూ ను కస్టమైజ్ చేసుకునేందుకు, ఫర్మ్ వేర్ ను అప్ గ్రేడ్ చేసుకునేందుకు, ఇంకా మరెన్నో వాటికి ఇది వీలు కల్పిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.
హై ఎండ్ ఎర్గోనామిక్ డిజైన్: ఎంతో సేపు పెట్టుకునేందుకు వీలుగా, గరిష్ఠస్థాయిలో సౌకర్యం అందించేలా ఎంతో ఆలోచనాత్మకంగా ఇవి డిజైన్ చేయబడ్డాయి. వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ తో ఇవి సాహసాలకు, వర్కవుట్లకు తిరుగులేని తోడుగా ఉంటాయి.
20 ఈక్యూ మోడ్స్ తో ప్రొ- సౌండ్ క్వాలిటీ : 20 ప్రిసెట్ ఈక్యూ మోడ్స్ తో ప్రీమియం సౌండ్ క్వాలిటీని ఆనందించండి. మీ ప్రాధమ్యాలకు అనుగుణంగా కస్టమ్ ఈక్యూ కూడా చేసుకోవచ్చు.
ఏఐ- పవర్డ్ నాయిస్ కేన్సిలేషన్: ఎంపిరికల్ టెక్నాలజీతో సూపర్ చార్జ్ చేయబడింది, క్వాడ్ ఎంఇఎంఎస్ మైక్ (ప్రతీ ఇయర్ బడ్ లోనూ డ్యూయల్ మైక్) తో 2X శక్తి సామర్థ్యం.
డెడికేటెడ్ గేమింగ్ మోడ్, ఆటో ఇన్ – కార్ సెన్సర్: అత్యుత్తమ గేమింగ్ అనుభూతిని అందించేలా గేమింగ్ మోడ్, 55ms దాకా అల్ట్రా లో లేటన్సీ తో వైర్లెస్ ఎయిర్ బడ్స్
పటిష్ఠమైన బ్యాటరీ పనితీరు: సింగిల్ చార్జ్ తో 48 గంటల ప్లే టైమ్, 10 గంటల ప్లేటైమ్, 300 ఎంఏహెచ్ చార్జింగ్ కేసుతో 38 గంటలు అదనంగా.