దమ్ముంటే అరెస్ట్ చేయండి : కేసీఆర్
ప్రధాని మోడీ సర్కార్‌లో ప్రతి ఒక్కరూ అవినీతి పరులు అని మరో మారు విమర్శించారు సీఎం కేసీఆర్. మోడీ పరిపాలనలో దేశ పరిస్థితి దిగజారిందన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మళ్లీ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారు. మోడీ పాలనలో నిరుద్యోగిత పెరిందని ఎన్ఓసీ వెల్లడించదన్నారు. మోడీ పాలనలో 33 పెద్ద అవినీతి పరులు దేశం వదిలి వెళ్లారని ఆరోపించారు. మోడీ దొంగలకు సద్దులు కడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో రాఫెల్ విమానాల కొనుగోలు విషయంలో పెద్ద అవినీతి జరిగిందన్నారు. దీన్ని పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ విషయంపై ఢిల్లీ చర్చ జరగలన్నారు. తాను కూడా ఢిల్లీ వెళ్లి చర్చ మొదలు పెడుతానన్నారు. గత కొన్ని కేసీఆర్ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. అవినీతి చేసిన వారికి భయం ఉంటుదన్నారు కానీ తనకు ఎటువంటి భయం లేదన్నారు. దొంగలు భయపడుతారని అన్నారు.