మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప‌లు విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా విమ‌ర్శిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తూనే ఉన్నారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌ధాని మోడీ, కేంద్రంపై మాట‌ల యుద్ధం చేస్తున్నారు.

మ‌రో వైపు జాతీయ రాజ‌కీయాల వైపు అడుగులు వేస్తున్న త‌రుణంలో ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నారు. భార‌త ప్ర‌ధానికి పాలన చేయ‌డం చేత‌కావ‌వ‌డం లేద‌ని.. ప్ర‌జ‌లు ఆశ్వీర‌దిస్తే ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతాన‌ని జ‌న‌గామ బ‌హిరంగ స‌భ‌లో వెల్ల‌డించారు. కేసీఆర్ ల‌క్ష్యం ఇప్పుడు సీఎం కాద‌ని… త‌న కొడుకు కేటీఆర్‌ని సీఎం చేసి తాను దేశ రాజ‌కీయాల్లోకి వెళ్లి ప్ర‌ధాని కావాల‌ని మ‌న‌సులో ఉన్న మాట మ‌రోమారు బ‌య‌ట‌పెట్టారు. ఇప్ప‌టికే చాలా సార్లు దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తాన‌ని చెప్పిన ఆయ‌న ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. అయితే కేసీఆర్‌కి ప్ర‌ధాని కావాల‌ని ఎంత ఆశ ఉందో మ‌రోమారు వెల్ల‌డైందంటున్నారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు.