కేసీఆర్ ఖేల్ ఖతమైతోంది : రేవంత్ రెడ్డి
మోడీ హైదారాబాద్ వచ్చినప్పటి నుండి కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయన మాటాల్లో వణుకు కనిపిస్తోందన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఆయన ఆ తరువాత తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రధాని మోదీపై ఎందుకు విరుచుకుపడలేదని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. మోదీని నిలదీయడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు? అన్నారు. జనగామలో ప్రసంగం విన్న తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతమ్ అన్న సంగతి స్పష్టమైందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణను అమరవీరుల త్యాగాలతో సాధించుకున్నారని, అలాంటి తెలంగాణను ఎవరైనా అవమానిస్తుంటే అసలు సిసలైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషం ప్రదర్శిస్తారని, కానీ కేసీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇవాళ జనగామలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని, బీజేపీని విమర్శించినా… మోదీ చేసిన రాష్ట్ర విభజన వ్యాఖ్యల ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.