అస్సాం మహిళకు కిమ్స్ ఐకాన్‌లో అరుదైన ఆప‌రేష‌న్‌

కణితులను గుర్తించడం కొంత కష్టం. చిన్నచిన్న లక్షణాలు కనిపించినప్పుడే వైద్యుల వద్దకు వెళ్లాలి. లేనిపక్షంలో అవి తీవ్రమై, పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక గృహిణికి వచ్చిన ఈ తరహా సమస్య, ఆమెకు అందించిన చికిత్స వివరాలను విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సాయి బలరామకృష్ణ వివరించారు.
“అస్సాంలోని కామరూప్ జిల్లా కి చెందిన 43 ఏళ్ల గృహిణి కుమారి కి(పేరు మార్చబడినది ) ఒక ఏడాది క్రితం బాగా తలనొప్పి వస్తే మైగ్రేన్ అనుకుని దానికి చికిత్స తీసుకున్నారు. దాదాపు అప్పటి నుంచి రుతుక్రమంలో బ్లీడింగ్ బాగా తగ్గడాన్ని ఆమె గమనించారు. సాధారణమే అనుకుని వదిలేశారు. తర్వాత వారం రోజుల ముందు నుంచి కుడి కంటిలో చూపు తగ్గడంతో కంటి వైద్యుడి వద్దకు వెళ్లారు. తీరా వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు కణితి ఉన్నట్లు తేలింది. జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే ఈ కణితులు ప్రతి వెయ్యిమందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యతో ఆమె విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు . ఇక్కడ ఆమెకు ఎంఆర్ఐ పరీక్ష చేయగా, దాదాపు 3 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న పిట్యుటరీ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. తర్వాత విజయవంతంగా శస్త్రచికిత్స చేశాం. సమయానికి ఈ శస్త్రచికిత్స చేసి, కణితిని తొలగించకపోతే అది మరింత పెరిగి, కంటి నరాలను నొక్కేసే ప్రమాదం ఉంది. దానివల్ల కంటిచూపు పూర్తిగా కోల్పోవడం, రెండోవైపు కూడా ఒత్తిడి పెరిగి చూపు తగ్గడం లాంటివి సంభవించొచ్చు. దాంతోపాటు పిట్యుటరీ గ్రంధి పాడవ్వడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే మధుమేహం, కషింగ్స్ సిండ్రోమ్తో పాటు మెదడులో ఒత్తిడి బాగా పెరిగి చివరకు కోమాలోకి వెళ్లి రోగి మరణించే అవకాశం కూడా వుంది.
అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్స
సాధారణంగా అయితే బయటివైపు నుంచి కోసి కణితులను తీస్తారు. కానీ ఈమెకు క్యూసా మైక్రోడెబ్రైడర్ హైడెఫినీషన్ నేసల్ ఎండోస్కోపీని మరియు టిసిల్ గ్లూ అనుబడిన అత్యాధునిక మెటీరియల్ ఉపయోగించి ముక్కుద్వారా ఈ కణితిని తొలగించాం. మధ్యవయస్కురాలు కావడంతో ఆమెకు జీవితంలో ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. సమయానికి శస్త్రచికిత్స చేయించుకుని ఆమె ఈ సమస్య నుంచి బయటపడ్డారు. గతంలో ఇలా బ్రెయిన్ ట్యూమర్లు, కంటి ట్యూమర్లకు కూడా ఈ ఆస్పత్రిలో విజయవంతంగా ముక్కుద్వారా శస్త్రచికిత్స చేశాం. ఆమె పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే 4 నెలల తరువాత స్కాన్ తీయగా కణితి తగ్గటం వలన మరల తిరిగి చూపు మునపటిలాగా వచ్చి అన్ని పనులు చేసుకుంటున్నారు. అయినా ఐదేళ్ల పాటు ఆమె ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది సంక్లిష్టమైన శస్త్రచికిత్స కావడంతో ఇందులో పాల్గొన్నన్యూరోసర్జరీ, ఆఫ్తల్మాలజీ, ఎండోక్రినాలజీ, రేడియాలజీ, అనస్థీషియా బృందానికి కృతజ్ఞతలు ” అని డాక్టర్ సాయి బలరామకృష్ణ తెలిపారు.