భారతదేశపు మొట్టమొదటి MOBA మొబైల్ గేమ్ మొబైల్ గేమింగ్ ల్యాండ్‌స్కేప్‌ను ఎలా మార్చబోతోంది
మొబా అనేది హార్డ్ కోర్ గేమర్స్ కు తిరుగులేని గేమింగ్ అనుభూతిని అందించే బాగా ప్రజాదరణ పొందిన ఫార్మాట్ గా ఉంది. కొత్తగా గేమింగ్ లో వచ్చేవారికి వస్తే, MOBA అంటే మల్టీ ప్లేయర్ ఆన్ లైన్ బ్యాటిల్ ఎరేనా. మొబా ఫార్మాట్ ఇది ఆడేవారికి తిరుగులేని అనుభూతిని అందించే, దృష్టిని కేంద్రీకరింపజేసే ఒక పోరాటం. భారతదేశంలో మొబా గేమ్స్ కు ఆదరణ పెరగడంలో క్లాష్ ఆఫ్ టైటాన్స్ కీలకపాత్ర పోషించింది. అది మొబైల్ ఉపకరణాల కోసం అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి భారతీయ మల్టీ ప్లేయర్ ఆన్ లైన్ బ్యాటిల్ ఎరేనా గేమ్. మొబైల్ గేమింగ్ కు పెరుగుతున్న నేపథ్యంలో ఈ టైటిల్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ ఉపకరణాల కోసం అభివృద్ధి చేయబడింది.
మొబా గేమ్స్ ఎందుకు బాగా ఆదరణ పొందుతున్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా ? భారతదేశంలో వాటి విజయం వెనుక ఉన్న రహస్యమేంటి ? అవి అంతగా ప్రజాదరణ పొందేందుకు దోహదపడిన నాలుగు ప్రముఖ కారణాలను ఇక్కడ ఇస్తున్నాం.
- సింపుల్ ఫార్మాట్ : క్లాష్ ఆఫ్ టైటాన్స్ వంటి మొబా గేమ్స్ సింపుల్ ఫార్మాట్ లో ఉంటాయి. ప్రత్యర్థుల స్థావరాన్ని నాశనం చేసే లక్ష్యంతో రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడుతాయి. దీని పనోప్టిక్ వ్యూ కారణంగా ఆటగాళ్లు పోరాటం ఎలా పెరుగుతోందో మొత్తంగా చూడవచ్చు. క్లాష్ ఆఫ్ టైటాన్స్ వంటి గేమ్స్ ఆటగాళ్లు తమ మొబైల్ లేదా చేతిలో పట్టుకునే ఉపకరణాలపై, తమ క్యారెక్టర్లను నియంత్రించేందుకు, పోరాటంలో పాల్గొనేందుకు రెండు వేళ్లతోనే ఆడేలా డిజైన్ చేయబడ్డాయి. ఇది ఆడేందుకు ఎంతో సరళమైంది, నిజంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
- హీరో వేరియంట్, పాత్రలు: మొబా గేమ్స్ ఎంచుకునేందుకు ఎన్నో హీరో అవతారాలు, స్కిన్స్ ను అందిస్తాయి. మీ నైపుణ్యం స్థాయితో సంబధం లేకుండా, ఆడేందుకు మీకు మరింత థ్రిల్ కలిగించేలా, వినోదం అందించేలా మీరు అద్భుత క్యారెక్టర్లను ఎంచుకోవచ్చు. క్లాష్ ఆఫ్ టైటాన్స్ లో 56 మంది టైటాన్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన శక్తి సామర్థ్యాలు. ట్యాంక్స్, వారియర్స్, అసాసియన్స్, మార్క్స్ మెన్…ఇలా మరెన్నో రకాలు.
- ఆడాలన్న అనుభూతి:
క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనేది ఫ్రీ – టు- ప్లే గేమ్. మొబా ఫార్మాట్ లో ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. గేట్ కీపింగ్ కు సంబంధించి ఎలాంటి గేమింగ్ ఫీ ఉండదు. రూకీ అయినా ప్రొ అయినా మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా మీ స్నేహితులతో కలసి పైసా కూడా వెచ్చించకుండా ఆడవచ్చు. ప్రతిరోజూ లాగ్ అయ్యే గేమర్లు ఫ్రీ టైటాన్స్, ఇతర ఉద్వేగభరిత రివార్డులను పొందగలుగుతారు.
- హైలీ సోషల్ :
మొబా గేమ్స్ ఆటగాళ్లు బాగా సోషలైజ్ అయేందుకు వీలు కల్పిస్తాయి. తమ నిర్దిష్ట టైటాన్ నైపుణ్యాలు, లక్షణాలను మరింతగా ఉపయోగించుకునేందుకు, ప్రత్యర్థుల స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు గాను ఆటగాళ్లు ఇతరులతో కలసి ఆడాల్సి ఉంటుంది. క్లాష్ ఆఫ్ టైటాన్స్ లో ఆటగాళ్లు తమ స్నేహితులను తమతో చేరాల్సిందిగా ఆహ్వానించవచ్చు. అలా ఓ స్క్వాడ్ ను తయారు చేసుకోవచ్చు. అంతా కలసి గేమ్ ను ఆనందించవచ్చు. మోబాలు గ్లోబల్ ఆన్ లైన్ కమ్యూనిటీల ఏర్పాటుకు కూడా దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఒక ఉమ్మడి బంధాన్ని పంచుకునేందుకు ముందుకు వస్తున్నారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలను ఒక్కటి చేసే శక్తిని, వారి అనుబంధాలను పటిష్ఠం చేసే సామర్థ్యాన్ని గేమ్స్ కలిగిఉన్నాయి. క్లాష్ ఆఫ్ టైటాన్ వంటివి ఇందుకు చక్కటి నిదర్శనంగా చెప్పవచ్చు.