అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ లో ‘ఉమెన్ సురక్ష’ ప్యాకేజిని ప్రారంభం
నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో “ప్రపంచ కేన్సర్ దినం” ప్రారంభాన్ని ప్రకటించారు. సమాజంలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనం ఉండాలన్న సందేశాన్ని పంచాలని ఈ సందర్భంగా చెప్పారు. యూనియన్ ఫర్ ఇంటర్నేసనల్ కేన్సర్ కంట్రోల్ సంస్థ ప్రతియేటా ఫిబ్రవరి 4ను ప్రపంచ కేన్సర్ దినంగా నిర్వహిస్తుంది. ఈ సారి క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది థీమ్‌గా తీసుకున్నారు. ప్రజలు ఈ వ్యాధి గురించి అర్థం చేసుకుని కేన్సర్ చికిత్స విషయంలో ఉన్న అనుమానాలను తొలగించుకోవాలని ఇలా చెప్పారు.
ఆస్పత్రి ప్రత్యేకంగా సమాజంలోని మహిళల ప్రయోజనం కోసం ‘ఉమెన్ సురక్ష’ అనే ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించింది. ప్రాథమిక దశలోనే కేన్సర్‌ను గుర్తించేందుకు అందుబాటులో ఉండే ప్యాకేజి ఇది. ఇందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ విత్ ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్) పరీక్ష, సెర్వైకల్ స్మియర్ లేదా పాప్ స్మియర్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డామిన్, గైనకాలజిస్టు కన్సల్టేషన్.. ఇవన్నీ కలిపి కేవలం రూ.1499/-కే అందిస్తున్నారు. ఈ ప్యాకేజి ఫిబ్రవరి 4 నుంచి నెలాఖరు వరకు ఉంటుంది.
ఈ కార్యక్రమం గురించి అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి సీఓఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ మాట్లాడుతూ, “అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి నగరంలోని అత్యుత్తమ మల్టీస్పెసాలిటీ ఆస్పత్రులలో ఒకటి. ఇక్కడ అన్నిరకాల కేన్సర్లను గుర్తించి, చికిత్సచేసే అత్యుత్తమ నిపుణులు ఉన్నారు. మన సమాజంలో మహిళలు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు, వివిధ కారణాల వల్ల ఆస్పత్రులకు వెళ్లరు. మన చుట్టూ ఉన్న సమాజంలోని ఈ సంక్లిష్టతలను అర్థం చేసుకుని, అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో మేం అందుబాటు ధరలో ప్రజలకు నాణ్యమైన చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ ఉమెన్ సురక్షా ప్యాకేజి వల్ల మహిళలు ముందుకొచ్చి, తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకుని, అవసరమైతే సరైన చికిత్సలు పొందగలరు” అని చెప్పారు.
కొవిడ్-19 మహమ్మారి మన దృష్టిని కేన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల నుంచి మళ్లించింది. మహిళల్లో ఎక్కువగా రొమ్ము, కొలోరెక్టల్, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార, చర్మ, గర్భకోశ కేన్సర్లు వస్తాయి. వీటి గురించి తెలుసుకుని, వాటిని నివారించడానికి లేదా ముందుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటే (అవి చిన్నగా ఉంటే విస్తరించవు, చికిత్స చేయడం కూడా సులభం) ప్రాణాలు కాపాడవచ్చు.
ఈ సందర్భంగా ఒక కేన్సర్ రోగి సోదరుడు మాట్లాడుతూ, “మా అన్నయ్య చికిత్స కోసం ఖమ్మం నుంచి వచ్చాము. అక్కడ చూపిస్తే ఇక్కడకు పంపారు. మొదట్లో కేన్సర్ అంటే చాలా భయపడ్డాము. ఎలా ఉంటుందో, ఏమో అనుకున్నాం. ఇక్కడకు రాగానే రేవంత్ సార్‌ని కలిశాము. చికిత్స అంటే ఏమీ భయపడక్కర్లేదని, చాలా సులభంగా అవుతుందని చెప్పి మాకు చాలా ధైర్యం చెప్పారు. నాలుగోదశ కాదు కాబట్టి ఇందులో మరణం ఉండదని అన్నారు. ఆయనతో పాటు ఇతర వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఏ స్టేజిలో వచ్చినా మాలో ధైర్యం నింపి, ముందు వ్యాధి గురించి అవగాహన కల్పించారు. ఇలా చికిత్స తీసుకుంటే తగ్గుతుందని, తాము చెప్పినట్లు చేయాలని అన్నారు. ఏంచేస్తున్నారో స్పష్టంగా చెప్పడమే కాక.. చెప్పినట్లే చేశారు. ఇప్పుడు మేం మూడో కీమోకు వచ్చాం. రేవంత్ సార్, జూజర్ సార్, రాజేష్ సార్ అందరికీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం” అని చెప్పారు.