ఎంపీ అసదుద్దీన్‌పై కాల్పుల కలకలం
హైదారాబాద్ ఎంపీ అసదుద్దీన్‌పై కాల్పుల జరగడం కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మీరట్ పట్టణంలోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై దుండగులు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు అసదుద్దీన్ ఒవైసీ. టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు కనిపించిందని, దుండగులు మొత్తం నలుగురు ఉన్నారని, కాల్పుల ఘటన వల్ల తన కారు పంక్చర్ కావడంతో వేరే వాహనంలో ఢిల్లీకి వెళ్లినట్లు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.